నెట్‌వర్క్‌ సమస్యకు చెక్.. టెలికాం సంస్థలకు ట్రాయ్ ఆదేశాలు

Published on Mon, 11/25/2024 - 18:59

ఏ సిమ్ కార్డు తీసుకున్నా.. దేశంలోని ఏదో ఒక మూల తప్పకుండా నెట్‌వర్క్‌ సమస్య అనేది తెలెత్తుతుంది. దీనిని నివారించడానికి టెలికాం కంపెనీలకు 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) కీలక ఆదేశాలను జారీ చేసింది.

టెలికాం సంస్థలు తమ వెబ్‌సైట్‌లలో తప్పకుండా.. జియో స్పేషియల్ కవరేజ్ మ్యాప్‌లను చూపించాలని ట్రాయ్ ఆదేశించింది. అంటే తమ నెట్‌వర్క్‌ ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉందనేది ఈ మ్యాప్‌ ద్వారా తెలుస్తుంది. దీన్ని బట్టి యూజర్ ఏ సిమ్ కొనుగోలు చేయాలనేది నిర్ణయించుకుంటాడు. దీని వల్ల యూజర్లు నెట్‌వర్క్‌ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా పోతుంది.

కొత్త నిబంధనల ప్రకారం.. టెలికాం సంస్థలకు సంబంధించిన 2జీ, 3జీ, 4జీ, 5జీ సర్వీసులు కూడా వెబ్‌సైట్‌లలో వెల్లడించాల్సి ఉంది. దీంతో వినియోగదారుడు ఏ సర్వీస్ ఎంచుకోవాలి.. తాను ఏ సర్వీస్ పరిధిలో ఉన్నాడు, అంతరాయం లేకుండా మొబైల్ ఉపయోగించడానికి ఉత్తమమైన నెట్‌వర్క్‌ ఏది అనే అన్ని వివరాలను సిమ్ కొనుగోలు చేయడానికి ముందే తెలుసుకోవచ్చు.

ట్రాయ్ ఆదేశించిన ఈ కొత్త మార్గదర్శకాలు యూజర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మెరుగైన నెట్‌వర్క్ కవరేజీని అందించే ప్రొవైడర్‌లను వినియోగదారుడు ముందుగానే ఎంచుకోవచ్చు. నెట్‌వర్క్ సమస్యల వల్ల కస్టమర్ అసంతృప్తిని తగ్గించవచ్చు. టెలికాం కంపెనీలు ఈ మ్యాప్‌లను ప్రచురించే ఫార్మాట్.. ఇన్‌పుట్‌ వంటి వాటిని సమర్పించడానికి కొంత సమయం తీసుకున్నట్లు సమాచారం.

Videos

30 వేల పెన్షన్ రావాల్సింది.. 13 వేలు ఇస్తున్నారు

మెటా తో లోకేష్ కుమ్మక్కు... సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్...

తలుపులేసుకుని తొడకొట్టే హీరో... మొత్తం గీసుకొని మీసం మెలేసే మొనగాడు..!

నడుములోతు నీళ్లలో లగ్గం.. వరదైనా తగ్గేదేలే అంటున్న జంట

చరిత్ర సృష్టించిన రష్మిక

DSCలో అవినీతి బట్టబయలు..! లోకేష్ రాజీనామా..?

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

Photos

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)