Breaking News

వాణిజ్య యుద్ధాలు తాత్కాలికమే! 

Published on Fri, 07/25/2025 - 06:10

న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధాలు ఎక్కువ కాలం పాటు కొసాగబోవని డెలాయిట్‌ దక్షిణాసియా సీఈవో రోమల్‌ శెట్టి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న అనిశ్చితులు వచ్చే కొన్ని నెలల్లో సమసిపోతాయని అంచనా వేశారు. గతం కంటే ఇప్పుడు భారత్‌–అమెరికా మరింత సన్నిహితంగా మారినట్టు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ద్వైపాక్షిక బంధం బలపడినట్టు తెలిపారు. దీనికితోడు భౌగోళికంగా వ్యూహాత్మకమైన స్థితిలో ఉండడంతో ఇతర దేశాలకు లేని అనుకూలతలు భారత్‌కు ఉన్నట్టు చెప్పారు. 

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయమై భారత్‌–అమెరికా మధ్య విస్తృత సంప్రదింపులు నడుస్తున్న తరుణంలో డెలాయిట్‌ సీఈవో వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 50–60 శాతం టారిఫ్‌లు కొనసాగడం అసాధ్యమని, అవి దిగొస్తాయని శెట్టి పేర్కొన్నారు. భారత్‌–అమెరికా తమ సొంత ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నాయని.. కనుక ఇవి మధ్యేమార్గానికి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో కొన్ని అట్టడుగు వర్గాలు, ఇతర విభాగాలున్న నేపథ్యంలో స్వేచ్ఛా వాణిజ్యం కుదుర్చుకోవడం సవాలుగానే అభివర్ణించారు. సంక్లిష్టమైన అంశాల పరిష్కారం అంత సులభం కాదంటూ.. ఎన్నో దశల చర్చల తర్వాతే ఏకాభిప్రాయం సాధ్యపడుతుందన్నారు. అంతిమంగా కుదిరే ఒప్పందం ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగిస్తుందని.. రెండు దేశాల మార్కెట్‌ వాటా పెరుగుతుందన్నారు.  

జీడీపీ వృద్ధి 6.7 శాతం 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని రోమల్‌ శెట్టి అంచనా వేశారు. వచ్చే దశాబ్దంన్నర (15 ఏళ్లు) పాటు ఏటా 7–8 శాతం వృద్ధి రేటు సాధ్యమేనన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో అంతర్జాతీయ సంక్షోభాలను (కరోనా, భౌగోళిక ఉద్రిక్తతలు) విజయవంతంగా అధిగమించడమే కాకుండా బలమైన వృద్ధిని నమోదు చేయడాన్ని గుర్తు చేశారు.

ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌.. ఈ ఏడాది జపాన్‌ను అధిగమించి 4.2 ట్రిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్‌ అంచనా వేయయం ఈ సందర్భంగా గమనార్హం. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు వెనుక సేవల రంగం పాత్రను రోమల్‌శెట్టి ప్రస్తావించారు. భారత ఆర్థిక వ్యవస్థకు సేవలే బలమంటూ.. అంతర్జాతీయ వాణిజ్య సవాళ్ల ప్రభావం ఏమంత ఉండబోదన్నారు.

ఇటీవలి సంవత్సరాల్లో వ్యవసాయ రంగం పనితీరు మెరుగుపడినట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య పరంగా కొంత ప్రభావం ఉన్నా కానీ, అది తాత్కాలికమేనన్నారు. తలసరి ఆదాయం 2,800 డాలర్ల నుంచి 4,000 డాలర్లకు చేరుకుందంటూ, ఇదే కాలంలో వాస్తవ వినియోగం రెట్టింపైనట్టు చెప్పారు. తయారీ, సెమీకండక్టర్లు క్రమంగా పట్టు సాధిస్తునట్టు తెలిపారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే ఉండొచ్చన్నారు. 2029–30 నాటికి మంచి స్థితికి చేరుకోవచ్చని అంచనా వేశారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)