Breaking News

టయోటో భారీ ప్రణాళికలు: రానున్న కాలంలో 10 కొత్త ఈవీ మోడళ్లు

Published on Sat, 04/15/2023 - 21:59

సాక్షి, ముంబై:ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ  పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి వాహన తయారీ సంస్థ టయోటా భారీ ప్రణాళికలే వేస్తోంది.  2026 నాటికి 10 కొత్త ఈబీ మోడళ్లను విడుదల   చేయనుంది. అలాగే 2030 నాటికి 3.5 మిలియన్ యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  

ఈ మేరకు టయోటా మోటార్ కొత్త ప్రెసిడెంట్ సీఈవో కోజీ సాటో  తన తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ హిరోకి నకాజిమా మాట్లాడుతూ, 2026 నాటికి కంపెనీ 10 కొత్త ఎలక్ట్రిక్ వాహన మోడళ్లను లాంచ్‌ చేయనుందనీ, తద్వారా ఏటా దాదాపు 1.5 మిలియన్ వాహనాలను విక్రయించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.

టయోటా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-వాహన పరిశ్రమలో ఆకట్టుకోలేకపోయింది.ముఖ్యంగా టెస్లా ,చైనా  బీవైడీతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో వెనుకబడి ఉంది. టెస్లా, బీవైడీ వేగంగా విస్తరిస్తున్న ఈ-మార్కెట్‌లో దూసుకు పోతుండటంతో టయోటా కొత్త  మేనేజ్‌మెంట్‌ ఈ రంగంలో అభివృద్ధిని వేగవంతం చేయాలనే టాస్క్‌లో పడిందని  నిక్కీ ఆసియా నివేదించింది.

దీనికితోడు గత సంవత్సరం కంపెనీ తొలి భారీ-ఉత్పత్తి బ్యాటరీ-ఆధారిత మోడల్, bz4X రీకాల్‌ కావడం భారీగా దెబ్బతీసింది. ఎస్‌ అండ్‌పీ  గ్లోబల్ మొబిలిటీ డేటా ప్రకారం, టయోటా 2022లో 21,650 బ్యాటరీతో నడిచే వాహనాలను విక్రయించింది.ఇది  కేవలం 0.3 శాతం వాటాను మాత్రమే. అత్యధికంగా అమ్ముడైన టెస్లా  1.27 మిలియన్ యూనిట్లను, బీవైడీ  810,600  వాహనాలను సేల్‌ చేసింది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)