Breaking News

దేశంలో అత్యంత సరసమైన 5 బైకులు ఇవే!

Published on Tue, 09/30/2025 - 14:56

భారతదేశంలో ద్విచక్ర వాహన మార్కెట్ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. లెక్కకు మించిన కంపెనీలు దేశీయ విఫణిలో కొత్త టూ వీలర్స్ లాంచ్ చేస్తూనే ఉన్నాయి. అయితే జీఎస్టీ 2.0 (GST 2.0) అమలులోకి వచ్చిన తరువాత వీటి ధరలు చాలా వరకు తగ్గాయి. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లోని సరసమైన బైకులు (Affordable Bikes) ఏవి?, వాటి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.

బజాజ్ ప్లాటినా 100
బజాజ్ ప్లాటినా 100 ధర రూ. 65,407 (ఎక్స్ షోరూమ్) చేరింది. ఈ బైక్ 102 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ ద్వారా 7.9hp పవర్ & 8.3Nm టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ పొందుతుంది. ఇది 70 కిమీ/లీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.

హోండా షైన్ 100
హోండా షైన్ 100 ధర రూ. 63,191 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 98.98 సీసీ ఇంజిన్ 7.38 హార్స్ పవర్, 8.04 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి.. కొంత ఎక్కువ మైలేజ్ ఇస్తున్న కారణంగా ఈ బైకుకు ఇండియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

హీరో హెచ్ఎఫ్ 100
హీరో హెచ్ఎఫ్ 100 ధర రూ. 58739 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌.. 7.9 హార్స్ పవర్, 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది 65 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి రోజువారీ వినియోగానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్
దేశంలోని అత్యంత సరసమైన బైకుల జాబితాలో.. టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ కూడా ఒకటి. దీని ధర రూ. 55100 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ ద్వారా 7.3 హార్స్ పవర్, 7.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ 2020లో బీఎస్6 ఉద్గార నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ అయింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)