Breaking News

కారులో అవసరం లేని 5 ఫీచర్స్.. ధర కూడా తగ్గుతుంది!

Published on Sat, 02/21/2026 - 21:25

కార్ల ధరలు ప్రధానంగా మీరు ఎంచుకునే ఫీచర్స్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు సరిగ్గా గమనిస్తే.. బేస్ వేరియంట్ ధర ఒకలా ఉంటే, టాప్ వేరియంట్ ధర ఇంకోలా ఉంటుంది. చూడటానికి కారు ఒకేలా కనిపించినా.. బేస్ వేరియంట్ - టాప్ వేరియంట్ ఫీచర్స్ వేరేలా ఉంటాయి. అంటే బేస్ వేరియంట్ లిమిటెడ్ ఫీచర్స్ పొందుతుంది. టాప్ వేరియంట్ ప్రీమియం ఫీచర్స్ లేదా అదనపు ఫీచర్స్ పొందుతుంది.

ప్రస్తుతం కారు కొనుగోలు చేసే చాలామంది ఎక్కువ ఫీచర్స్ ఉన్న కార్లనే కొంటున్నారు. ఫీచర్స్ ఉన్న కార్లను కొంటున్నారు సరే.. ఉన్న ఫీచర్స్ ఉపయోగిస్తున్నారా.. అంటే?, లేదనే చెప్పాలి. అలాంటప్పుడు ఫీచర్స్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం కూడా వృధా. కాబట్టి ఈ కథనంలో ఫాఫాపు అవసరం లేని 5 ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.

బిల్ట్ నావిగేషన్ సిస్టమ్‌లు
చాలా మంది డ్రైవర్లు గూగుల్ మ్యాప్స్ లేదా యాపిల్ మ్యాప్స్ ఉపయోగిస్తారు. అయితే వీటికంటే ఫోన్ నావిగేషన్ మరింత ఖచ్చితమైనది. అప్పటికప్పుడు అప్డేట్స్ పొందుతుంది.

పవర్డ్ టెయిల్‌గేట్
బటన్‌తో బూట్‌ను ఓపెన్ చేయడం అద్భుతంగా అనిపిస్తుంది. కానీ ఈ ఫీచర్ చిన్న కార్లలో అంత అవసరం లేదు. ఎందుకంటే ఇది చేతితో ఓపెన్ చేయడం కంటే నెమ్మదిగా ఉంటుంది. ఇది పెద్ద కార్లకు అనుకూలంగా ఉంటుంది.

పనోరమిక్ సన్‌రూఫ్
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని కార్లలో ఈ పనోరమిక్ సన్‌రూఫ్ ఫీచర్ ఉంది. కానీ చాలామంది ఈ ఫీచర్ ఎక్కువగా ఉపయోగించరు. ఎక్కువ గాలి లేదా ఎండ వస్తుందని దాదాపు క్లోజ్ చేసి ఉంచుతారు.

గెస్టర్ కంట్రోల్ సిస్టమ్స్
గెస్టర్ కంట్రోల్ సిస్టమ్స్ అంటే మీ చేతిని ఊపి మ్యూజిక్ మార్చడం లాంటి ఫీచర్. మొదట చూడటానికి ఇది చాలా కూల్‌గా అనిపించవచ్చు, కానీ ఎక్కువసార్లు ఇవి సరిగ్గా పని చేయవు. కాబట్టి టచ్ కంట్రోల్ ఎంపిక చేసుకోవచ్చు. ఇది వేగంగా ఉంటుంది, నమ్మదగినదిగా ఉంటుంది.

టచ్-ఓన్లీ క్లైమేట్ కంట్రోల్స్
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ ద్వారా ACని అడ్జస్ట్ చేయడం చికాకును కలిగిస్తుంది. కాబట్టి ఫిజికల్ నాబ్‌లు సులభంగా ఉంటాయి. ప్రత్యేకించి దీనిపై శ్రద్ద చూపాల్సిన అవసరం లేదు.

ఒక కారును కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అవసరమైన ఫీచర్స్ ఏవి కావాలి?, వాటిని ఎంతవరకు ఉపయోగిస్తాము అనే విషయాలను ముందుగానే ఆలోచించుకోవాలి. లేకుంటే మీకు అవసరం లేని ఫీచర్లకు కూడా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అవసరం.

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)