Breaking News

ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకులు ఇవే!

Published on Sat, 12/28/2024 - 16:18

భారతదేశంలోని అత్యంత సరసమైన బైకుల జాబితాలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హోండా షైన్, టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా, యమహా ఎఫ్​జెడ్ ఎఫ్ఐ వంటివి ఉన్నాయి. ఈ బైక్స్ ధరలు ఎలా ఉన్నాయి? ఇతర వివరాలు ఏంటి అనేది ఇక్కడ చూసేద్దాం.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)
భారతదేశంలో తక్కువ ధర వద్ద లభిస్తున్న ఉత్తమ బైకులలో 'హీరో హెచ్ఎఫ్ డీలక్స్' ఒకటి. దీని ధర రూ.56,674 (ఎక్స్ షోరూమ్). ఇది మొత్తం ఐదు వేరియంట్లలో, ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైకులోని 97 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.91 Bhp పవర్, 8.05 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

హోండా షైన్ (Honda Shine)
రూ.62,990 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న హోండా షైన్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ బైక్ 10.59 Bhp పవర్, 11 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లలో, ఐదు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది కూడా భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన బైకుల జాబితాలో ఒకటి.

టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)
భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్న మోడల్ టీవీఎస్ స్పోర్ట్. దీని ధర రూ.64,410 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులోని 190 సీసీ ఇంజిన్ 8.18 Bhp పవర్, 8.7 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు వేరియంట్లలో లభించే ఈ బైక్.. మొత్తం ఎనిమిది రంగులలో లభిస్తుంది.

బజాజ్ ప్లాటినా (Bajaj Platina)
సరసమైన బైకుల జాబితాలో ఒకటి బజాజ్ ప్లాటినా. దీని ధర రూ.66,840 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 7.79 Bhp పవర్, 8.34 Nm టార్క్ అందించే 102 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది కేవలం ఒకే వేరియంట్.. నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇదీ చదవండి: గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ సాధించిన హ్యుందాయ్ కారు ఇదే

యమహా ఎఫ్​జెడ్ ఎఫ్ఐ (Yamaha FZ Fi)
యమహా కంపెనీకి చెందిన ఎఫ్​జెడ్ ఎఫ్ఐ.. సరసమైన బైకుల జాబితాలో ఒకటిగా ఉన్నప్పటికీ, మన జాబితాలో కొంత ఎక్కువ ఖరీదైన బైక్ అనే చెప్పాలి. దీని ధర రూ.1.16 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 12.2 Bhp పవర్, 13.3 Nm టార్క్ అందిస్తుంది. ఇది రెండు వేరియంట్‌లు, రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)