Breaking News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్: ఇదిగో టాప్ 5 బైకులు

Published on Fri, 12/13/2024 - 18:01

మార్కెట్లో లక్ష రూపాయల నుంచి రూ.70 లక్షల వరకు బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే.. చాలామంది ధరను మాత్రమే కాకుండా మైలేజ్‌ను దృష్టిలో ఉంచుకుని టూ వీలర్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ కథనంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైకులు గురించి వివరంగా తెలుసుకుందాం.

బజాజ్ ఫ్రీడమ్ 125
'బజాజ్ ఫ్రీడమ్ 125' అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్. దీని ధర రూ.89,997 నుంచి రూ. 1.09 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 9.3 బిహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఇందులో సీఎన్‌జీ, పెట్రోల్ కోసం రెండు ఫ్యూయల్ ట్యాంకులు ఉంటాయి. ఈ బైక్ 65 కిమీ/లీ మైలేజ్ ఇస్తుందని సమాచారం.

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్
ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో 'టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్' ఒకటి. ఈ బైక్ ధరలు రూ. 75541 నుంచి రూ. 78541 (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ బైకులో ఎకోథ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (ETFi) టెక్నాలజీ ఉంది. కాబట్టి ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ పనితీరును అందిస్తుంది. ఈ బైకులోని 110 సీసీ ఇంజిన్ 8 బీహెచ్‌పీ పవర్, 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 86 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

బజాజ్ ప్లాటినా 110
రూ. 71,354 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభిస్తున్న బజాజ్ ప్లాటినా 110 బైక్ 70 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 115 సీసీ ఇంజిన్ 8.4 బీహెచ్‌పీ పవర్, 9.8 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో ఎల్ఈడీ డీఆర్ఎల్, హ్యాండ్ గార్డ్‌లు, వైడ్ ఫుట్‌పెగ్‌లు, 5 స్పీడ్ గేర్‌బాక్స్ వంటివి ఉన్నాయి.

హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్
హోండా సీడీ 110 డ్రీమ్ డీలక్స్ కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకుల జాబితాలో ఒకటి. రూ. 74401 (ఎక్స్ షోరూమ్) వద్ద లభిస్తున్న ఈ బైక్ 110 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది జపనీస్ ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్ (ESP) టెక్నాలజీ పొందుతుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ మైలేజ్ 65 కిమీ/లీ అని తెలుస్తోంది.

ఇదీ చదవండి: 10 రోజుల్లో 10000 మంది కొన్న కారు ఇదే..

హీరో స్ప్లెండర్ ప్లస్
భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న బైకుల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్. ఈ బైక్ ధరలు రూ. 75441 నుంచి రూ. 78286 మధ్య ఉన్నాయి. 100 సీసీ ఇంజిన్, ఐ3ఎస్ టెక్నాలజీ కలిగిన ఈ బైక్ 80.6 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి దీనిని మైలేజ్ రాజు అని కూడా పిలుస్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)