Breaking News

భారత్‌లోని బెస్ట్ క్రూయిజర్ బైకులు ఇవే!

Published on Sat, 01/11/2025 - 16:42

మార్కెట్లో సాధారణ బైకులకు మాత్రమే కాకుండా.. క్రూయిజర్ మోటార్‌సైకిళ్లకు కూడా జనాదరణ లభిస్తోంది. దీంతో చాలామంది ఈ బైకులను కొనొగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో భారతదేశంలో అమ్మకానికి ఉన్న టాప్ 5 బెస్ట్ క్రూయిజర్‌ బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.

కవాసకి డబ్ల్యు175 (Kawasaki W175)
భారతదేశంలో అత్యంత సరసమైన క్రూయిజర్‌ బైకులలో కవాసకి డబ్ల్యు175 ఒకటి. దీని ప్రారంభ ధర రూ. 1.22 లక్షలు. ఈ బైకులోని 177 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 12.8 హార్స్ పవర్, 12.2 ఏంఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 45 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. మంచి డిజైన్, స్పోక్డ్ రిమ్స్.. అల్లాయ్ వీల్స్‌ కలిగిన ఈ బైక్ సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.

టీవీఎస్ రోనిన్ (TVS Ronin)
చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన టీవీఎస్ రోనిన్ ధరలు రూ. 1.35 లక్షల నుంచి రూ. 1.72 లక్షల మధ్య ఉన్నాయి. ఇందులోని 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 20.1 హార్స్ పవర్, 19.93 Nm టార్క్ అందిస్తుంది. ఇది 42.95 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. ఈ బైకులో లేటెస్ట్ ఫీచర్స్.. సస్పెన్షన్ సిస్టమ్ వంటివన్నీ ఉన్నాయి. ఇది నగరంలో, హైవేపై రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.

బజాజ్ అవెంజర్ 220 (Bajaj Avenger 220)
మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ క్రూయిజర్ బైకులలో బజాజ్ అవెంజర్ 220 కూడా ఒకటి. దీని ధర రూ. 1.45 లక్షలు. ఇందులో 18.76 హార్స్ పవర్, 17.55 న్యూటన్ మీటర్ టార్క్ అందించే 220 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. 40 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ రెట్రో డిజైన్ కలిగి ట్విన్ షాక్ రియర్ సస్పెన్షన్ సెటప్ పొందుతుంది. కాబట్టి ఇది లాంగ్ రైడ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

క్యూజే ఎస్ఆర్సీ 250 (QJ SRC 250)
మార్కెట్లో అందుబాటులో ఉన్న క్యూజే ఎస్ఆర్సీ 250 బైక్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. 50 కిమీ / లీ మైలేజ్ అందించే ఈ బైక్ 249 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 17.4 హార్స్ పవర్, 17 Nm టార్క్ అందిస్తుంది. ఈ బైక్ రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇదీ చదవండి: ఆరు నెలల్లో 40000 మంది కొన్న బైక్ ఇది

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350)
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి చెందిన సరసమైన బైక్ ఈ హంటర్ 350. దీని ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు. ఇందులో 349 సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 20.2 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 36 కిమీ / లీ మైలేజ్ అందిస్తుంది. అత్యంత ఆకర్షణీయమైన క్రూయిజర్‌ బైకులలో ఒకటైన హంటర్ 350 మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)