Breaking News

మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. వాహనదారులకు గుడ్‌న్యూస్!

Published on Fri, 02/13/2026 - 15:22

టోల్ వసూళ్లకు సంబంధించి.. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్స్‌ప్రెస్‌వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును తగ్గించాలని నిర్ణయించింది. ఇది 2026 ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిర్మాణం పూర్తికాని లేదా కొంత భాగం మాత్రమే ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్‌వేలపై వసూలు చేస్తున్న టోల్ ఫీజును 25 శాతం తగ్గించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 2008లో అమలులోకి వచ్చిన జాతీయ రహదారుల ఫీజు నియమాలలో సవరణలు చేసి ఈ తగ్గింపును అమలులోకి తీసుకురానున్నారు.

ఇప్పటివరకు.. ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా అందుబాటులో లేకపోయినప్పటికీ.. ప్రయాణికులు ఎక్కువ టోల్ చెల్లించాల్సి వచ్చేది. రోడ్డు నిర్మాణం పూర్తికాకపోయినా.. ఎక్కువ ఫీజులు వసూలు చేయడం అనేది ప్రజలకు భారంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు టోల్ చెల్లింపులు తగ్గిస్తూ కొత్త నిర్ణయం తీసుకున్నారు.

ఇక్కడ వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. 25 శాతం టోల్ ఫీజు తగ్గింపు అనేది శాశ్వతం కాదు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత సాధారణ టోల్ ఫీజును వసూలు చేస్తారు. అంటే సాధారణ ఎక్స్‌ప్రెస్‌వే రేట్లు అమలులోకి వస్తాయన్నమాట.

ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. ప్రజలను కొత్తగా నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వేలను ఉపయోగించేందుకు ప్రోత్సహించడమే. టోల్ ఫీజు తక్కువగా ఉంటే ఎక్కువ మంది ఆ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంది. దీంతో జాతీయ రహదారులపై ట్రాఫిక్ తగ్గుతుంది.

ఇదీ చదవండి: ఎంజీ మెజెస్టర్ వచ్చేసింది: రూ.41 వేలతో బుకింగ్!

#

Tags : 1

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)