Breaking News

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు: ఇక కొనుగోలు కష్టమే!

Published on Thu, 02/13/2025 - 14:09

వారం రోజుల తరువాత గోల్డ్ రేటు తగ్గింది అనుకునే లోపలే.. మళ్ళీ పెరిగింది. దీంతో మళ్ళీ బంగారం ధరలలో కదలికలు ఏర్పడ్డాయి. నేడు (గురువారం) తులం పసిడి ధర గరిష్టంగా రూ. 87050 వద్ద ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,800 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 87,050 వద్ద నిలిచాయి. నిన్న రూ. 700, రూ. 710 తగ్గినా గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ రూ. 400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 380 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.

చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 400, రూ. 380 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 79,800 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 87,050 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు తగ్గుదలను నమోదు చేశాయి.

ఇదీ చదవండి: భారత్‌లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు: గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?

దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 79,950 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 87,200 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 310 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.

వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ.. వెండి రేటు మాత్రం ఎనిమిదో రోజు స్థిరంగానే ఉంది. దీంతో ఈ రోజు (12 ఫిబ్రవరి) కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000లకు చేరుకుంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష రూపాయలు దాటేసినప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 99,500 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)