Breaking News

మారిన బంగారం ధరలు: తులం ఎంతంటే?

Published on Thu, 01/02/2025 - 10:23

2024లో భారీగా పెరిగిన బంగారం ధరలు (Gold Price).. 2025లో కూడా కొనసాగుతున్నాయి. రెండు రోజుల్లోనే గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 770 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో నేటి (January 2) బంగారం ధరలు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో గోల్డ్ రేటు వరుసగా రూ.300 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.330 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,800కు చేరుకోగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 78,330 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.

చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 71,800 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 78,330 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 300, రూ. 330 పెరిగిందని స్పష్టమవుతోంది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. అయితే ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 78,480 రూపాయలు, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,950. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు దేశంలోని ఇతర నగరాల కంటే కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

వెండి ధరలు
దేశంలో బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు (Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. కొత్త ఏడాది.. దేశంలోని ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర రూ.90,500 వద్ద ఉంది. రాబోయే రోజుల్లో వెండి రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)