EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి: కొత్త ధరలు ఇవే..
Published on Fri, 09/06/2024 - 11:10
సెప్టెంబర్ ప్రారంభం నుంచి తగ్గుతూ ముందుకు సాగిన బంగారం ధరలు నేడు (సెప్టెంబర్ 6) ఒక్కసారిగా పెరిగాయి. దీంతో తులం బంగారం ధర రూ.73000 దాటేసింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.
విజయవాడ, హైదరాబాద్లలో మాత్రమే కాకుండా బెంగళూరు, ముంబై, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో శుక్రవారం బంగారం ధరలు పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 510 పెరిగి తులం రేటు రూ. 67,200 వద్దకు చేరింది. 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 550 పెరిగి 10 గ్రాముల ధర రూ.73,310 వద్ద నిలిచింది.
చెన్నైలో కూడా బంగారం ధరల పెరిగాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 67,200 & 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,310గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 510, రూ. 550 ఎక్కువ.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 67,350 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.73,460 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఈ రోజు వరుసగా రూ. 510, రూ. 550 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు కొంత అధికంగా ఉన్నయని స్పష్టంగా తెలుస్తోంది.
వెండి ధరలు
బంగారం ధరల మాదిరిగా కాకుండా.. వెండి ధర రూ. 2000 పెరిగింది. నిన్న స్థిరంగా ఉన్న వెండి ధర ఈ రోజు అమాంతం పెరగటం వల్ల కేజీ రేటు రూ. 87000కు చేరింది. దీన్ని బట్టి చూస్తే వెండి ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయా అని అనిపిస్తోంది. ఇదే ధరలు దేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంటాయి.
ఇదీ చదవండి: 8.5 లక్షల జాబ్స్.. కలిసొచ్చిన ఫెస్టివల్ సీజన్
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Tags : 1