Breaking News

రూ. 75వేలు దాటేసిన బంగారం.. రూ. లక్షకు చేరువలో వెండి

Published on Mon, 09/16/2024 - 12:35

బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా తులం పసిడి ధర గరిష్టంగా రూ. 160 పెరిగింది. దీంతో నిన్న స్థిరంగా వున్న గోల్డ్ రేటు, ఈ రోజు కొంత ముందుకు కదిలింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్‌లలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68800 వద్ద, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 75050 వద్ద ఉంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబైలలో కూడా కొనసాగుతాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 160 పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో మాదిరిగానే.. చెన్నైలో కూడా తులం గోల్డ్ రేటు వరుసగా రూ. 150 (22 క్యారెట్స్), రూ. 160 (24 క్యారెట్స్) పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 68800 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75050గా ఉంది.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలలో స్వల్పంగా పెరిగాయి. కాబట్టి ఇక్కడ బంగారం ధర రూ. 68950 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.75150 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు, ఈ రోజు వరుసగా రూ. 150, రూ. 110 పెరిగింది.

ఇదీ చదవండి: 'ఏఐకు అదో పెద్ద సవాలు'

వెండి ధరలు
దేశంలో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 98,000 వద్ద ఉంది. ఈ రోజు కేజీ వెండి ధర రూ.1000 పెరగడంతో రూ. 98వేలకు చేరింది. ఇదే ధరలు దాదాపు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ కొనసాగుతాయి. ధరలు ఇలాగే కొనసాగితే.. కేజీ సిల్వర్ రేటు లక్ష రూపాయలకు చేరుకోవడానికి మరెన్నో రోజులు పట్టే అవకాశం లేదు.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)