బంగారం కొనడానికి ఇది మంచి తరుణం!.. ఎందుకంటే?

Published on Mon, 06/10/2024 - 14:35

రెండు రోజులకు ముందు భారీగా తగ్గిన బంగారం ధరలు ఉలుకు పలుకు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఏకంగా రూ. 2080 తగ్గి పసిడి ప్రియులకు ఊరట కలిగించిన గోల్డ్ రేటు అదే ధర వద్ద నిలిచింది. ఈ రోజు (జూన్ 10) దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

హైదరాబాద్‌, విజయవాడలలో సోమవారం ఒక తులం బంగారం ధరలు రూ. 65700 (22 క్యారెట్స్), రూ.71760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరలే ఈ రోజు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో కూడా ఈ రోజు పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. దీంతో నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65850, కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71820గా ఉంది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి కాబట్టి కొనుగోలు చేయడానికి ఇది మంచి తరుణం అని తెలుస్తోంది.

హైదరాబాద్‌, విజయవాడ, ఢిల్లీలలో గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నప్పటికీ, చెన్నైలో మాత్రం ఈ రోజు కూడా బంగారం ధర స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66300 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 72330 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. గోల్డ్ ధర నిన్నట్లి కంటే రూ. 200, రూ. 220 తగ్గినట్లు స్పష్టమవుతోంది.

వెండి ధరలు
బంగారం ధరలు పసిడి ప్రియులకు ఊరట కలిగించినప్పటికీ.. వెండి మాత్రం స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. ఈ రోజు (జూన్ 10) ఒక కేజీ వెండి ధర రూ. 91700 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి ధరల కంటే ఈ రోజు ధరలు రూ. 200 పెరిగినట్లు తెలుస్తోంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)