Breaking News

టైటాన్‌ లాభం హైజంప్‌

Published on Wed, 02/11/2026 - 03:10

న్యూఢిల్లీ: జ్యువెలరీ, వాచీల తయారీ టాటా గ్రూప్‌ దిగ్గజం టైటాన్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 61 శాతం జంప్‌చేసి రూ. 1,684 కోట్లను తాకింది. దేశీయంగా జ్యువెలరీ అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 1,047 కోట్లు ఆర్జించింది. అమ్మకాలు సైతం 42 శాతం ఎగసి రూ. 24,915 కోట్లను తాకాయి. అయితే మొత్తం వ్యయాలు 41 శాతం పెరిగి రూ. 23,192 కోట్లకు చేరాయి. 

కాగా..  ఇతర ఆదాయంతో కలసి మొత్తం టర్నోవర్‌ 43 శాతం బలపడి రూ. 25,567 కోట్లకు చేరింది. తనిక, మియా, జోయా, కేరట్‌లేన్‌ బ్రాండ్ల జ్యువెలరీ బిజినెస్‌ ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 23,492 కోట్లయ్యింది. వీటిపై 11 శాతం మార్జిన్లు సాధించింది. అంతర్జాతీయ అమ్మకాలు 83 శాతం దూసుకెళ్లి రూ. 1,058 కోట్లను తాకాయి. జ్యువెలరీ బిజినెస్‌లో 49 స్టోర్లను కొత్తగా జత కలుపుకోగా.. వీటిలో 24 కేరట్‌లేన్‌ విభాగానివే. 22 కొత్త స్టోర్లను జత చేసుకున్న వాచీలు తదితరాల విభాగం 14 శాతం అధికంగా రూ. 1,295 కోట్ల ఆదాయం అందుకుంది.  ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు బీఎస్‌ఈలో 0.25 శాతం బలపడి రూ. 4,267 వద్ద ముగిసింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)