Breaking News

టైటన్‌ హీలియోస్‌కు కొత్త బ్రాండ్స్‌

Published on Sun, 09/15/2024 - 00:56

న్యూఢిల్లీ: లగ్జరీ వాచ్‌ల విక్రయంలో ఉన్న టైటన్‌ హీలియోస్‌ మరిన్ని విదేశీ బ్రాండ్స్‌ను జోడిస్తోంది. 12–18 నెలల్లో కొత్తగా 10 బ్రాండ్స్‌ను పరిచయం చేయనుంది. ప్రస్తుతం హీలియోస్‌ స్టోర్లలో టామీ హిల్‌ఫిగర్, టిస్సో, స్వరోస్కీ, ఫాజిల్‌ వంటి 45 బ్రాండ్ల వాచ్‌లు కొలువుదీరాయి. వీటి ధరలు రూ.5,000 మొదలుకుని రూ.1,00,000 వరకు ఉన్నాయి. మరోవైపు హీలియోస్‌ స్టోర్ల సంఖ్యను కంపెనీ గణనీయంగా పెంచుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 50 ఔట్‌లెట్లు రానున్నాయని టైటన్‌ వాచెస్, వేరబుల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ శుక్లా వెల్లడించారు.

 ‘మొత్తం వ్యాపారంలో హీలియోస్‌ నుంచి 10 శాతం ఆదాయం సమకూరుతోంది. ఈ విభాగం ఆదాయం 45 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నాం. హీలియోస్‌ టర్నోవర్‌లో 20 శాతం కొత్త కలెక్షన్, లిమిటెడ్‌ ఎడిషన్స్‌ నుంచి అందుకోవాలని దృష్టిపెట్టాం. పండుగల సీజన్‌ ప్రమోషన్స్‌ కారణంగా కస్టమర్ల రాక, ఆన్‌లైన్‌ సేల్స్‌ 20–25 శాతం అధికం అవుతాయని భావిస్తున్నాం. అన్ని బ్రాండ్స్‌లో కలిపి ఏటా 150 దాకా కేంద్రాలను జోడిస్తున్నాం’ అని వివరించారు. టైటన్‌కు దేశవ్యాప్తంగా 95 నగరాలు, పట్టణాల్లో 240 హీలియోస్‌ స్టోర్లు ఉన్నాయి. హీలియోస్‌తోపాటు టైటన్‌ వరల్డ్, ఫాస్ట్‌ట్రాక్, రాగా, జూప్, ఎస్‌ఎఫ్‌ బ్రాండ్లలో 1,110కిపైగా కేంద్రాలు ఉన్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)