Breaking News

టిక్‌టాక్‌ సంచలన నిర్ణయం: వాళ్లందరిపైనా వేటు! 

Published on Fri, 02/10/2023 - 16:06

సాక్షి,ముంబై:  సోషల్‌ మీడియా సంస్థ, ఇండియాలో బ్యాన్‌ అయిన టిక్‌టాక్‌ సంచలన నిర్ణయం  తీసుకుంది.  ఇండియా కేంద్రంగా పనిచేస్తున్న ఉద్యోగులంద‌రినీ తొల‌గించింది. భార‌త్ నుంచి బ్రెజిల్‌, దుబాయ్ మార్కెట్లకు ప‌ని చేస్తున్న వారినందరికి ఉద్వాసన పలికింది.  ఫలితంగా దాదాపు 40మంది ప్రభావితంకానున్నారు.  నిషేధం తరువాత  భారత్‌లోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలన్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో టిక్‌టాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మూడు సంవత్సరాల క్రితం  నిషేధానికి గురైన టిక్‌టాక్ ఆఫీసులను కూడా మూసివేయనుంది.

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, బైట్‌డాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్‌ ఈ వారం 40 మందికి పింక్ స్లిప్‌లను అందించింది.  తొలగించిన ఉద్యోగులకు తొమ్మిది నెలల జీతాన్ని చెల్లిస్తామని పేర్కొంది త‌మ గ్లోబ‌ల్‌, ప్రాంతీయ సేల్స్ టీమ్స్‌కు స‌పోర్ట్ కోసం 2020లో భార‌త్‌లో ఏర్పాటు చేసిన రిమోట్ సేల్స్ స‌పోర్ట్ హ‌బ్‌ను మూసివేయాల‌ని నిర్ణ‌యించామ‌ని టిక్‌టాక్ ప్ర‌తినిధి ఒ‍్క ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

మరోవైపు గత ఏడాది  అమెరికాలోనూ  అన్ని ఫెడరల్ ప్రభుత్వ  డివైస్‌లలో టిక్‌టాక్‌పై నిషేధాన్ని ఆమోదించింది. టిక్‌టాక్ వినియోగాన్ని నిరోధించే లక్ష్యంతో రూపొందించిన బిల్లుపై ఈ నెలలో ఓటింగ్ నిర్వహించాలని హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ యోచిస్తోంది. భార‌త్‌లో నిషేధంతో మార్కెట్ వాటాను కోల్పోయినప్ప‌టికీ టిక్‌టాక్ ఇప్ప‌టికీ భార‌త్‌లో కార్యాల‌యాన్ని కొన‌సాగిస్తోంది. భార‌త్ కార్యాల‌యం కేంద్రంగా ప‌నిచేస్తున్న ఉద్యోగులు బ్రెజిల్‌, దుబాయ్ మార్క‌ట్ల కోసం ప‌నిచేస్తున్నారు.తాజాగా వీరందరికి ఉద్వాసన పలికింది.  

చైనా కంపెనీ బైట్‌డాన్స్ యాజమాన్యంలోని వీడియో షేరింగ్  యాప్‌  టిక్‌టాక్‌ను సరిహద్దు ఉద్రిక్తతలు, జాతీయ భ‌ద్ర‌త కార‌ణాల‌తో 2020లో కేంద్రం   నిషేధించిన సంగతి తెలిసిందే.

#

Tags : 1

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)