Breaking News

14,000 లేఆఫ్స్!.. ప్రముఖ కంపెనీ ఫౌండర్ ఏమన్నారంటే?

Published on Fri, 03/21/2025 - 11:17

దిగ్గజ కంపెనీలు భారీ లేఆఫ్స్ ప్రకటించిన తరువాత.. థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ వేలుమణి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. సంవత్సరానికి 3.5 బిలియన్ డాలర్ల ఖర్చులను ఆదా చేయడానికి అమెజాన్ 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు వచ్చిన వార్తలకు ప్రతిస్పందనగా ట్వీట్ చేశారు.

అమెజాన్, మెటా, గూగుల్ వంటి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించడానికి చాలా కష్టపడతారు. ఉద్యోగం వచ్చిన తరువాత సంబరపడతారు. ''ఇలాంటి బ్రాండ్లతో క్యాంపస్ ప్లేస్‌మెంట్ పొందినందుకు ఎంతమంది సంబరాలు చేసుకున్నారో ఊహించుకోండి. ఇప్పుడు ఎంతమంది నిరాశకు గురవుతారో..! కేవలం 10, 20 మంది కాదు.. ఏకంగా 14,000 మంది ఈ ప్రభావానికి గురవుతున్నారు. కెరీర్ లేదా బిజినెస్ అనేది మారథాన్ రేస్'' అని థైరోకేర్ ఫౌండర్ అన్నారు.

వేలుమణి ట్వీట్ మీద పలువురు స్పందించారు. 'కలామ్ సర్ చెప్పినట్లుగా కంపెనీకి విధేయంగా ఉండాల్సిన అవసరం లేదు, మీ పనికి విధేయంగా ఉండండి" అని ఒకరు అన్నారు. కార్పొరేట్ ఉద్యోగాలు ఎప్పుడైనా పోవచ్చు, కాబట్టి ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంపొందించుకోండి అని మరొకరు అన్నారు.

అమెజాన్ లేఆఫ్స్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఏకంగా 14,000 మంది ఉద్యోగులను బయటకు పంపించడానికి సిద్ధమవుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి, లాభాలను గడించడానికి కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి పూనుకుంది. దీని ద్వారా సంస్థ 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేయనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోత పూర్తయితే సంస్థలో పనిచేస్తున్న వారి సంఖ్య 1,05,770 నుంచి 91,936కు చేరుతుంది.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)