Breaking News

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్‌ వాహనదారులకు శుభవార్త!

Published on Sun, 10/12/2025 - 14:51

హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) చార్జింగ్‌ సొల్యూషన్స్‌ అందించే థండర్‌ప్లస్‌ తాజాగా వాహనాల దిగ్గజం టాటా మోటర్స్‌తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతో పాటు మరో అయిదు రాష్ట్రాల్లో చిన్న వాణిజ్య వాహనాల చార్జింగ్‌ కోసం కొత్తగా 5,000 పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లను థండర్‌ప్లస్‌ ఇన్‌స్టాల్‌ చేయనుంది.

వాణిజ్య వాహనాల పోర్ట్‌ఫోలియోను విద్యుదీకరించుకోవాలన్న టాటా మోటర్స్‌ ప్రయత్నాలకు ఇది సహాయకరంగా ఉండనుంది. నిరాటంకమైన, విశ్వసనీయమైన, విస్తరించతగిన విధంగా ఈవీ చార్జింగ్‌ స్టేషనలను అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని థండర్‌ప్లస్‌ సీఈవో రాజీవ్‌ వైఎస్‌ఆర్‌ తెలిపారు  

తెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్‌కు డిమాండ్‌ 
తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌యూవీలకు అప్‌గ్రేడ్‌ కావాలనుకునే కస్టమర్లు తమ పంచ్‌ వాహనం వైపు మొగ్గు చూపే ధోరణి నెలకొందని టాటా మోటర్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ (టీఎంపీవీ) తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య కాలంలో తమ మొత్తం అమ్మకాలకు సంబంధించి తెలంగాణలో 21 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 25 శాతం వాటా పంచ్‌దే ఉందని పేర్కొంది.

హైదరాబాద్, విజయవాడలో ఈ ఎస్‌యూవీ విక్రయాలు రెండింతలు పెరిగాయని కంపెనీ వివరించింది. నవరాత్రుల సందర్భంగా దేశవ్యాప్తంగా టాటా మోటర్స్‌ విక్రయాల్లో పంచ్‌ వాటా 33 శాతంగా నమోదైనట్లు  పేర్కొంది. సెప్టెంబర్‌లో దేశీయంగా టాప్‌ 5 కార్లలో ఒకటిగా నిల్చిందని వివరించింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)