అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఎస్ఎస్ఆర్, ఎస్ఐఆర్ మధ్య తేడాలివే.. సింపుల్గా తెలుసుకోండి
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్కు చుక్కెదురు
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: ఏ వాహనానికి ఎంతెంత?
Published on Wed, 06/21/2023 - 07:07
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) వివిధ రకాల వాహనాల థర్డ్–పార్టీ మోటార్ ఇన్సూరెన్స్కి సంబంధించి కేంద్రం కొత్త బేస్ ప్రీమియం రేట్లను ప్రతిపాదించింది. బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐతో సంప్రదించిన మీదట 1,000 సీసీ సామర్థ్యం లోపు గల ప్రైవేట్ కార్లకు రూ. 2,094, 1000–1,500 సీసీ కార్లకు రూ. 3,416, అంతకు మించిన వాటికి రూ. 7,897 బేస్ ప్రీమియంను సూచించింది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఈ మేరకు ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. పరిశ్రమ వర్గాలు 30 రోజుల్లోగా దీనిపై అభిప్రాయాలు చెప్పాలి. నోటిఫికేషన్ ప్రకారం..
- 75 సీసీ లోపు సామర్ధ్యమున్న టూ–వీలర్లకు రేటు రూ. 538గాను, అంతకు మించి 350 సీసీ వరకు రూ. 714–2,804 శ్రేణిలోనూ బేస్ ప్రీమియం ఉండనుంది.
- గూడ్స్ రవాణా చేసే వాణిజ్య వాహనాలకు సంబంధించి (త్రిచక్ర వాహనాలు కాకుండా) 7,500 కేజీలలోపు వైతే రూ. 16,049, అది దాటి 40,000 కేజీలు.. అంతకు పైన వాటికి రూ. 27,186–44,242 శ్రేణిలో బేస్ ప్రీమియం రేటు ఉంటుంది.
- ఈ–కార్టులు మినహా మోటార్ త్రీ–వీలర్లకు బేస్ ప్రీమియంను రూ. 4,492గా ప్రతిపాదించారు.
- అటు ప్రైవేట్ ఈ–కార్ల విషయానికొస్తే.. 30 కిలోవాట్ సామర్థ్యం ఉన్న వాటికి రూ. 1,780, అంతకు మించి 65 కేడబ్ల్యూ వరకు రూ. 2,904, దాన్ని దాటితే రూ. 6,712 గాను బేస్ ప్రీమియం ఉండనుంది.
#
Tags : 1