Breaking News

బస్సులకు డిజిటల్‌ పాస్‌లు.. యాప్‌లో బుకింగ్

Published on Mon, 10/06/2025 - 17:24

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజా రవాణా వ్యవస్థ మరింత స్మార్ట్‌గా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ఈఎస్‌డీ) విభాగం నిర్వహిస్తున్న ‘మీటికెట్’ యాప్ ద్వారా త్వరలో టీజీఆర్‌టీసీ ఇంటర్‌సిటీ బస్సు సేవలు & క్యూ ఆర్ ఆధారిత డిజిటల్ బస్ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి.

స్టేట్ స్మార్ట్ మొబిలిటీ ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ విస్తరణతో ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించనుంది. ఇక నుంచి బస్సు టికెట్లు, నెలవారీ పాస్‌లు మొబైల్‌లోనే పొందవచ్చు. 2025 జనవరి 9న ప్రారంభమైన మీటికెట్ యాప్ ఇప్పటికే మంచి ఆదరణ పొందుతోంది. ఇప్పటి వరకు 1.35 లక్షల డౌన్‌లోడ్లు, 2.6 లక్షల టికెట్ బుకింగ్స్, రూ.2 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. యాప్ రేటింగ్ 3.5కు పైగా ఉండగా, ప్రస్తుతం 221 ప్రదేశాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో, 123 పార్కులు, 16 దేవాలయాలు, ఆరు మ్యూజియాలు, ఖుత్బ్ షాహీ సమాధులు వంటి ప్రదేశాలు ఈ సేవల్లో ఉన్నాయి.

టీజీఆర్‌టీసీ సేవలు చేర్చడంతో ఇకపై సాధారణ, మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, గ్రీన్ మెట్రో లగ్జరీ (ఎసీ), పుష్పక్ ఎసీ బస్సులకు కూడా డిజిటల్‌గా టికెట్లు, పాస్‌లు పొందవచ్చు. ఇది విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు వంటి ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. మొబైల్ యాప్ ద్వారా చెల్లింపు చేసుకోవచ్చు. దీంతో క్యూ‌లలో నిలబడాల్సిన అవసరం ఉండదు.

ప్రస్తుతం మీటికెట్ పరిధిలో 98 అటవీ ప్రదేశాలు, 52 పర్యాటక బోటింగ్ సెంటర్లు, 16 దేవాదాయ శాఖ దేవాలయాలు, 9 వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర పురావస్తు మ్యూజియం, గాంధీ సెంటెనరీ మ్యూజియం వంటి ప్రదేశాలను కూడా ఈ యాప్‌లో చేర్చారు. పర్యాటకులు, స్థానికులకు ఇది సులభతరం అవుతుందని అధికారులు తెలిపారు. టీజీఆర్‌టీసీ సేవల అధికారిక ప్రారంభ తేదీ త్వరలో ప్రకటించనున్నట్లు ఈఎస్‌డీ విభాగం వెల్లడించింది. ఇది రాష్ట్రంలో పౌర సౌకర్యాలను పెంచుతూ, డిజిటల్ గవర్నెన్స్ వైపు తెలంగాణ మరో ముందడుగు అని అధికారులు పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)