Breaking News

టెస్లా కీలక నిర్ణయం: వేలాది కార్లపై ఎఫెక్ట్

Published on Sat, 03/22/2025 - 14:42

అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla).. తన 'సైబర్ ట్రక్' కార్లకు రీకాల్ ప్రకటించింది. ఇప్పటి వరకు డెలివరీ చేసిన అన్ని సైబర్ ట్రక్కులలోనూ సమస్య ఉందని గుర్తించడంతో ఈ రీకాల్ ప్రకటించింది. ఈ ప్రభావానికి 46,000 కంటే ఎక్కువ కార్లు ప్రభావితమయ్యాయి.

డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. బాహ్య ప్యానెల్ విడిపోతుందనే ఆందోళనల కారణంగా ఈ రీకాల్ ప్రకటించడం జరిగింద 'నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్' (NHTSA) వెల్లడించింది. మే 19 నుంచి వాహన యజమానులకు మెయిల్ ద్వారా రీకాల్ విషయాన్ని కంపెనీ తెలియజేయనుంది.

టెస్లా సైబర్ ట్రక్ వెలుపలి భాగంలో ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ ట్రిమ్ ప్యానెల్ విడిపోయే అవకాశం ఉంది. దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ సన్నద్ధమైంది. దీనికోసం వాహనదారులు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా భర్తీ చేస్తామని ఆటోమేకర్ కస్టమర్లకు హామీ ఇచ్చింది.

టెస్లా.. తన సైబర్ ట్రక్ కోసం రీకాల్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. యాక్సిలరేటర్ పెడల్ ఇరుక్కుపోవడం, డ్రైవ్ పవర్ కోల్పోవడం, లోపభూయిష్ట విండ్‌షీల్డ్ వైపర్‌లు, ఎలక్ట్రిక్ ఇన్వర్టర్ సమస్య వంటి కారణాలతో 15 నెలల్లో పలుమార్లు రీకాల్ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మరోమారు ఈ రీకాల్ ప్రకటించడం గమనార్హం.

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)