Breaking News

హల్దీరామ్స్‌లో టెమాసెక్‌కు వాటా 

Published on Fri, 03/14/2025 - 01:37

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ కంపెనీ హల్దీరామ్స్‌ స్నాక్స్‌ ఫుడ్‌లో సింగపూర్‌ సావరిన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం టెమాసెక్‌ 10 శాతం వాటా కొనుగోలు చేస్తోంది. కంపెనీ విలువను 10 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 85,000 కోట్లు)గా మదింపు చేసి వాటాను సొంతం చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ఈ వారం మొదట్లో ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించాయి. అంటే 10 శాతం వాటాకు సుమారు బిలియన్‌ డాలర్లు(రూ. 8,500 కోట్లు) వెచి్చంచనున్నట్లు అంచనా. 

దేశీయంగా ప్యాక్‌డ్‌ స్నాక్, స్వీట్స్‌ తయారీలో దిగ్గజంగా నిలుస్తున్న హల్దీరామ్స్‌  రెస్టారెంట్లను సైతం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో రూ. 12,500 కోట్ల టర్నోవర్‌ సాధించింది. కంపెనీలో మరింత వాటా విక్రయం ద్వారా ప్రమోటర్లు అగర్వాల్‌ కుటుంబం మరో ఇన్వెస్టర్‌కు సైతం చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. కొద్ది నెలలుగా పీఈ దిగ్గజాలు బ్లాక్‌స్టోన్, అల్ఫావేవ్‌ గ్లోబల్, బెయిన్‌ క్యాపిటల్‌ కన్సార్షియం తదితరాలతో వాటా విక్రయానికి హల్దీరామ్స్‌ చర్చలు నిర్వహించింది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే అవకాశముంది. తొలుత మెజారిటీ వాటాను విక్రయించాలని భావించిన ప్రమోటర్లు తదుపరి మైనారిటీ వాటా విక్రయానికే ఆసక్తి చూపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)