Breaking News

టెలిగ్రామ్‌ సీఈవో ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాడా?

Published on Mon, 09/02/2024 - 20:37

టెలిగ్రామ్‌ సీఈవో పావెల్ దురోవ్ పాత ఫోటోలు ఆన్‌లైన్‌లో మళ్లీ తెరపైకి వచ్చాయి. తన రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాడని రూమర్స్‌ వ్యాపిస్తున్నాయి. అక్రమ లావాదేవీలు, పిల్లల అశ్లీల చిత్రాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మోసాలు వంటివాటిని టెలిగ్రామ్‌ అనుమతిస్తోందన్న ఆరోపణలపై ఇటీవల ఫ్రాన్స్‌లో దురోవ్‌ అరెస్టయ్యారు.

రష్యాలో జన్మించిన పావెల్ దురోవ్ 2013లో టెలిగ్రామ్‌ను మెసేజింగ్ యాప్‌గా ప్రారంభించారు. ఫోర్బ్స్ అంచనా ప్రకారం దురోవ్ సంపద 15.5 బిలియన్‌ డాలర్లు. భారత కరెన్సీలో రూ.1.3 లక్షల కోట్లు. దుబాయ్‌కి చెందిన ఈ బిలియనీర్‌ను వారం రోజుల క్రితం పారిస్‌లో అదుపులోకి తీసుకున్నారు.

దురోవ్ 2011 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు సందర్భాల్లో ఆయన తన ఫోటోలను షేర్‌ చేస్తూ వస్తున్నారు. దురోవ్‌ ఇటీవలి ఫొటోల్లో ఒత్తైన జుట్టు, టోన్డ్ ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. చొక్కా లేకుండా దిగిన ఫొటోలు సైతం సోషల్‌ మీడియాలో ఉన్నాయి. అయితే దురోవ్‌ ఇటీవలి ఫొటోలు పాత ఫొటోలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.

సోషల్‌ మీడియాలో వైరల్‌
ఇలా దురోవ్ తాజా ఫొటోలను, పాత ఫొటోలను పోలుస్తూ ఓ యూజర్‌ సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఆయన ప్లాస్టిక్‌ సర్జరీ, హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నాడన్న పుకార్లు నెట్టింట్లో షికారు చేస్తున్నాయి. దీనిపై ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్‌ చేస్తున్నారు. దురోవ్‌ హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారని, లేదు విగ్‌ పెట్టుకున్నారని ఇలా తలో వాదన చేస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)