Breaking News

2.75 లక్షల ఫోన్‌ నంబర్లకు చెక్‌

Published on Wed, 09/04/2024 - 14:44

ఇబ్బందికర కాల్స్, నమోదుకాని టెలిమార్కెటర్లపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఉక్కుపాదం మోపుతోంది. ట్రాయ్‌ ఆదేశాలతో 2.75 లక్షల ఫోన్‌ నంబర్లను టెలికాం సంస్థలు డిస్‌కనెక్ట్‌ చేశాయి. నమోదుకాని 50 టెలిమార్కెటింగ్‌ కంపెనీలకు చెందిన టెలికాం సేవలను బ్లాక్‌ చేసినట్లు ట్రాయ్‌ వెల్లడించింది.

ఈ చర్యలు స్పామ్‌ కాల్స్‌ను తగ్గించడంలో, కస్టమర్లకు ఉపశమనం కలిగించడంలో గణనీయ ప్రభావాన్ని చూపుతాయని ట్రాయ్‌ భావిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న స్పామ్‌ కాల్స్‌ వల్ల 2024 ప్రథమార్థంలో నమోదుకాని టెలిమార్కెటర్లపై 7.9 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని ట్రాయ్‌ తెలిపింది. ఇబ్బందికర కాల్స్‌ను కట్టడి చేసేందుకు ట్రాయ్‌ 2024 ఆగస్ట్‌ 13న అన్ని యాక్సెస్‌ ప్రొవైడర్లకు కఠిన ఆదేశాలను జారీ చేసింది. టెలికాలం వనరులను దుర్వినియోగం చేస్తున్న నమోదుకాని టెలిమార్కెటర్ల నుంచి ప్రమోషనల్‌ వాయిస్‌ కాల్స్‌ను తక్షణమే నిలిపివేయాలని, రెండేళ్ల వరకు డిస్‌కనెక్షన్‌ లేదా బ్లాక్‌ లిస్టులో పెట్టాలని యాక్సెస్‌ ప్రొవైడర్లను ఆదేశించింది. ఇబ్బంది కలిగించే కాల్స్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా..50కి మించిన కాల్స్‌ లేదా ఎస్‌ఎంఎస్‌లు పంపే నిర్దిష్ట నంబర్‌కు గ్రేడ్స్‌ ప్రకారం అధిక టారిఫ్‌ను ప్రవేశపెట్టాలని ట్రాయ్‌ ఇటీవలే తన చర్చా పత్రం ద్వారా టెలికాం కంపెనీలకు సూచించింది.

ఇదీ చదవండి: బెంగళూరు - హైదరాబాద్‌ టిక్కెట్‌ రూ.99కే!

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)