Breaking News

మళ్లీ మొబైల్‌ బిల్లుల మోత!

Published on Wed, 07/09/2025 - 00:56

టెలికం యూజర్లు పెరుగుతున్న నేపథ్యంలో టెల్కోలు మరో విడత చార్జీల వడ్డనకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి 10–12 శాతం మేర పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యస్తంగాను, అధిక మొత్తంలోను చెల్లించే వర్గాలు టార్గెట్‌గా ఈ పెంపు ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది జూలైలోనే బేస్‌ ప్లాన్లను 11–23 శాతం పెంచేసినందున, ఈసారి వాటి జోలికెళ్లకుండా డేటా అ్రస్తాన్ని వాడుకోవాలనే యోచనలో కంపెనీలు ఉన్నట్లు పేర్కొన్నాయి. బేస్‌ ప్లాన్లను మళ్లీ పెంచితే యూజర్లు.. ప్రత్యర్థి కంపెనీకి మారిపోయే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణం.

కాబట్టి ఈసారి డేటా ప్రయోజనాలను తగ్గించేసి, మరింత ఖరీదైన ప్లాన్ల వైపు మళ్లించేలా ఈ విడత పెంపు ఉండబోతోందని సంబంధిత వర్గాలు వివరించాయి. డేటా వినియోగం, డేటా స్పీడ్‌ లేదా డేటాను అత్యధికంగా వినియోగించే వేళలకు వర్తించే విధంగా ఈ పెంపు ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. టారిఫ్‌ల స్వరూపం మారాల్సిన అవసరం ఉందంటూ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా టాప్‌ మేనేజ్‌మెంట్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చార్జీల పెంపు వార్తలకు ఊతమిస్తున్నాయి. అందరికీ ఒకే రకం టారిఫ్‌ను వర్తింపచేయడమనేది సరి కాదంటూ ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విఠల్‌ ఈ మధ్య వ్యాఖ్యానించారు. ఇటు

వినియోగదారులు, అటు కస్టమర్లు బండిల్డ్‌ ప్లాన్లకు అప్‌గ్రేడ్‌ కావడం వల్ల దేశీ టెలికం పరిశ్రమ ఆదాయ వృద్ధి 2025–27 ఆర్థిక సంవత్సరాల్లో రెండంకెల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు బీఎన్‌పీ పారిబా ఒక నివేదికలో తెలిపింది. 

యాక్టివ్‌ యూజర్ల వృద్ధి.. 
మే నెలలో యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 29 నెలల గరిష్టమైన 74 లక్షలకు ఎగియడంతో మొత్తం యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 108 కోట్లకు చేరింది. దీనితో వరుసగా అయిదు నెలల పాటు కొత్త యూజర్ల సంఖ్య పెరిగినట్లయింది. మే నెలలో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ కొత్త యూజర్ల సంఖ్య 55 లక్షలు పెరిగింది. దీంతో జియో యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 150 బేసిస్‌ పాయింట్లు (సుమారు 1.5 శాతం) పెరిగి, పరిశ్రమవ్యాప్తంగా మొత్తం యాక్టివ్‌ యూజర్లలో వాటా 53 శాతానికి చేరింది. అటు భారతి ఎయిర్‌టెల్‌ కొత్త యూజర్ల సంఖ్య 13 లక్షలు పెరిగింది.

మొత్తం యాక్టివ్‌ యూజర్లలో ఎయిర్‌టెల్‌ వాటా 36 శాతానికి పెరిగింది. రాబోయే రోజుల్లో 5జీ సేవల విస్తరణ, వినియోగం ఆధారంగా కొత్త కనెక్షన్లు ఉంటాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జియోలాంటి టాప్‌ ఆపరేటర్ల యూజర్లు పెరగడమనేది భవిష్యత్తులో టారిఫ్‌ల పెంపునకు సానుకూల పరిస్థితులున్నట్లుగా కనిపిస్తోందని బ్రోకరేజ్‌ సంస్థ జెఫ్రీస్‌ పేర్కొంది. వొడాఫోన్‌ ఐడియా యూజర్లు తగ్గిపోయే కొద్దీ ఎయిర్‌టెల్, జియోల మా ర్కెట్‌ వాటా మరింతగా పెరుగుతుందని తెలిపింది. – సాక్షి, బిజినెస్‌డెస్క్‌

#

Tags : 1

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు