Breaking News

తెలంగాణ టి-ఫైబర్‌కు జాతీయ గుర్తింపు..

Published on Wed, 10/08/2025 - 18:20

తెలంగాణ టి-ఫైబర్‌కు (Telangana T-Fiber ) జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో టి-ఫైబర్ పైలట్ విలేజెస్‌ డిజిటల్ ఇన్‌క్లూజన్ విజయానికి ప్రశంసలు పొందాయి. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ చొరవను "ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్" గా అభివర్ణించారు. గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీకి వినూత్న విధానాన్ని అవలంభిస్తున్నందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబును అభినందించారు.

ఈ సందర్బంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన ఐటీ మంత్రుల రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. భారత్ నెట్ అమలును వేగవంతం చేయడానికి, రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యూ) సవాళ్లను పరిష్కరించడానికి, జాతీయ, రాష్ట్ర డిజిటల్ ఆస్తులను రక్షించడానికి సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ లను బలోపేతం చేయడానికి కేంద్రంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి తెలంగాణ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ప్రతి ఇల్లు, సంస్థ, వ్యాపారాలకు హై-స్పీడ్ కనెక్టివిటీని అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రధాన బ్రాడ్‌ బ్యాండ్ చొరవ అయిన టి-ఫైబర్ కింద సాధించిన పురోగతిని ఆయన వివరింంచారు. మంత్రితో పాటు టి-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్ వేణు ప్రసాద్ పన్నీరు కూడా ఉన్నారు. పైలట్ గ్రామాల నుంచి రాష్ట్ర విజయగాథలు, డేటా-ఆధారిత ఫలితాలను ఆయన వివరించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 (India Mobile Congress- IMC) అక్టోబర్‌ 8 నుంచి అక్టోబర్‌ 11 వరకు నాలుగు రోజులపాటు జరగనుంది. డిజిటల్ టెక్నాలజీ, టెలికాం ఆవిష్కరణలకు భారతదేశ ప్రధాన వేదికగా విధాన రూపకర్తలు, పరిశ్రమ నాయకులు, ప్రపంచ నిపుణులను ఒకచోట చేర్చింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)