Breaking News

12 సార్లు రిజెక్ట్.. 13వ ప్రయత్నంలో ఉద్యోగం!

Published on Mon, 07/20/2026 - 21:02

జీవితంలో విజయం ఒక్కసారిగా రాదు. ఎన్నో అపజయాలు, నిరాశలను దాటిన తర్వాతే విజయం లభిస్తుంది. దీనికి నిదర్శనంగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో షేర్ చేసుకున్నారు. వరుసగా 12 సార్లు తిరస్కరణ ఎదురైనా ఆశ వదులుకోకుండా ప్రయత్నించి, 13వ ప్రయత్నంలో గూగుల్‌లో ఉద్యోగం సాధించిన విషయాన్ని వెల్లడించారు.

గూగుల్ మాత్రమే కాదు, మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం పొందడానికి కూడా తనకు 16 సార్లు తిరస్కరణ ఎదురైందని వెల్లడించాడు. అమెజాన్‌లో మూడుసార్లు అప్లికేషన్ తిరస్కరించబడగా, యాపిల్, ఒరాకిల్ వంటి సంస్థల నుంచి ఒక్కసారి కూడా ఇంటర్వ్యూకు పిలుపు రాలేదని తెలిపారు. అయినప్పటికీ ఎక్కడా నిరాశ చెందకుండా తన ప్రయత్నాలను కొనసాగించినట్లు పేర్కొన్నాడు.

తన విజయానికి కారణం కేవలం అదృష్టం మాత్రమే కాదని, సరైన ప్రణాళిక కూడా ముఖ్యమని చెప్పారు. ఉద్యోగాలకు విచక్షణ లేకుండా దరఖాస్తు చేయకుండా, తమ రెజ్యూమ్‌కు సరిపోయే పోస్టులకే అప్లై చేయాలని సూచించారు. అలాగే కంపెనీలో పనిచేస్తున్న పరిచయస్తుల ద్వారా హెచ్‌ఆర్‌ను సంప్రదించడం, లింక్డ్‌ఇన్‌లో మేనేజర్లతో కనెక్ట్ కావడం వంటి మార్గాలు కూడా ఉద్యోగ అవకాశాలను పెంచుతాయని వివరించారు.

ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు ఆయన పట్టుదలను అభినందించారు. మరికొందరు మాత్రం మంచి కాలేజీ లేదా పెద్ద కంపెనీల అనుభవం కూడా ఉద్యోగ అవకాశాలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ఇంటర్వ్యూ సన్నద్ధతను మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు.

#

Tags : 1

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)