Breaking News

స్మార్ట్‌గా మారిపోతున్నారు.. పాత వాటి స్థానంలో కొత్త ఉపకరణాలు

Published on Tue, 04/04/2023 - 08:24

సాక్షి, అమరావతి: రోజురోజుకూ మారిపోతున్న టెక్నాలజీతో స్మార్ట్‌ వస్తువుల వినియోగం పెరుగుతోంది. స్మార్ట్‌ ఫోన్లు, వాచీలే కాదు గృహోపకరణాలు కూడా స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఈ డివైస్‌­లు ప్రజల జీవన విధానాన్ని మార్చేస్తున్నాయి. మార్కెట్‌లో స్మార్ట్‌ పరికరాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. అధునాతన సౌకర్యాన్ని అందించే ఉత్పత్తులకు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. పాత టీవీలు, వాషింగ్‌ మెషీన్లు, ఫ్యాన్లు స్థానంలో కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఉత్పత్తులు వచ్చి చేరుతున్నాయి.

5జీ సాంకేతికత అందుబాటులోకి వ­చ్చాక దాని ఆధారిత స్మార్ట్‌ పరికరాలకు వినియోగదారులు ప్రాధాన్యమిస్తున్నారు. సౌకర్యంతో పాటు సులభంగా, తక్కువ సమయంలో పనులను ము­గించడం, మరింత ఆనందంగా జీవించడానికి వీలు­గా స్మార్ట్‌ పరికరాలు తోడ్పడుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. స్మార్ట్‌ పరికరాల వినియోగంపై టె­చార్క్‌ సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా క­నెక్టెడ్‌ కన్సూ్యమర్‌ రిపోర్ట్‌’ పలు అంశాలను వెల్లడించింది. 2023లో స్మా­ర్ట్‌ పరికరాల కొ­ను­గో­లు మరింత పెరుగుతుంద­ని పేర్కొంది.

అయితే 5జీ టెక్నా­లజీ ఆధారిత స్మార్ట్‌ పరికరాల్లో వినియోగదారులు ఆశిస్తున్న సామర్థ్యం ఉండటం లేదని, ఈ పరికరాల్లో సామర్థ్యం మరింత ఉండాలని ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నట్లు తమ సర్వేలో తేలిందని టెచార్క్‌ వివరించింది. దాంతో పాటు స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబులు, ఇతర పరికరాల వల్ల తమ వ్యక్తిగత సమాచారానికి భంగం వాటిల్లుతుందేమోనన్న ఆందోళన కూడా వినియోగదారుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలిపింది. సామాన్యుల్లో కూడా ఈ స్మార్ట్‌ పరికరాల కోసం రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చు పెడుతున్నారు. కొనుగోలుదారు­ల్లో 32 శాతానికి పైగా స్మార్ట్‌ పరికరాలవైపు వెళ్తు­న్నారు. అయితే ఈ స్మార్ట్‌ పరికరాల వినియోగంపై, బ్రాండ్‌లపై నమ్మకం వంటి అంశాల్లో ఇంకా చాలా మందిలో అవగాహన ఉండటం లేదని సర్వే పేర్కొంది.  

జీవన ప్రమాణాలను మారుస్తున్న వాటిలో స్మార్ట్‌ పరికరాల పాత్ర ఇలా... 
కంఫర్ట్‌ కన్వీనియన్స్‌ పరికరాలు: 69% 
సోషల్‌ రికగ్నిషన్‌– ప్రెస్టీజ్, స్టయిల్‌: 53% 
కనెక్టివిటీ ఆటోమేషన్‌: 53% 
టైమ్‌ సేవింగ్‌ ప్రొడక్ట్స్‌: 46%  
ఎనర్జీ మేనేజ్‌మెంటు: 19%  
సేఫ్టీ, సెక్యూరిటీ: 17% 

ఏ స్మార్ట్‌ వస్తువు ఎంత శాతం మంది వాడుతున్నారంటే.. 
వాచ్, ఫిట్‌నెస్‌ బ్యాండ్‌  72
టీవీ 28  
లైట్లు 82
ఏసీలు14 
కెమెరాలు 48 
వాషింగ్‌ మెషీన్‌ 12 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)