Breaking News

30వేల ఉద్యోగుల తొలగింపు?: స్పందించిన కంపెనీ

Published on Mon, 03/09/2026 - 12:58

2026లో ప్రముఖ కంపెనీలెన్నో తమ ఉద్యోగులను తొలగించాయి. ఇలాంటి సమయంలో టెక్ మహీంద్రా కంపెనీ కూడా ఒకేసారి 30వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి. దీనిపై సదరు కంపెనీ స్పందించింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్‌కు ఇచ్చిన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు.. కేవలం తప్పుదారి పట్టించే వదంతులేనని పేర్కొంది. మార్కెట్‌లో అనవసర గందరగోళం రాకుండా.. ఉండేందుకు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలిపింది.

టెక్ మహీంద్రా కంపెనీ ఏజెంటిక్ ఏఐ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేసేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆ తరువాత లేఆఫ్స్ ప్రచారం తెరమీదకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ విషయంపై కంపెనీ క్లారిటీ ఇచ్చేసింది. కాగా.. టెక్ మహీంద్రా త్రైమాసిక గణాంకాల ప్రకారం కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇదీ చదవండి: పసిడి ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం, వెండి!

ఏఐ కారణంగానే ఉద్యోగులను తొలగించనున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు AI ఉపయోగాన్ని పెంచుతున్న నేపథ్యంలో ఉద్యోగాలపై ప్రభావం పడవచ్చనే భావన అని తెలుస్తోంది. అయితే టెక్ మహీంద్రా భారీ స్థాయి ఉద్యోగాల కోత గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.

#

Tags : 1

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)