Breaking News

టెక్‌ మహీంద్రాకు లాభాల జోష్‌

Published on Fri, 07/17/2026 - 19:17

ఐటీ సేవల దిగ్గజం టెక్‌ మహీంద్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 1,465 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన రూ. 1,140తో పోలిస్తే సుమారు 28 శాతం పెరిగింది. మరోవైపు ఆదాయం సుమారు 18 శాతం వృద్ధితో రూ. 13,351 కోట్ల నుంచి రూ. 15,712 కోట్లకు చేరింది.

త్రైమాసికాలవారీగా చూస్తే క్యూ1లో మొత్తం సిబ్బంది సంఖ్య 863 మేర తగ్గి 1,46,760కి పరిమితమైంది. గడిచిన పన్నెండు నెలల వ్యవధిలో ఐటీ అట్రిషన్‌ రేటు సుమారు 11.8 శాతంగా ఉంది. అటు డాలరు మారకంలో చూస్తే ఆదాయం వార్షికంగా 6.1 శాతం, సీక్వెన్షియల్‌గా 2.2 శాతం వృద్ధి చెంది 1,660 మిలియన్‌ డాలర్లుగా నమోదైంది. వరుసగా మూడో త్రైమాసికంలోను బిలియన్‌ డాలర్ల పైగా డీల్స్‌ను సాధించినట్లు కంపెనీ సీఈవో మోహిత్‌ జోషి తెలిపారు.

50 మిలియన్‌ డాలర్ల పైగా కాంట్రాక్టులు ఇచ్చిన సంస్థల సంఖ్య ఏడు మేర పెరిగినట్లు వివరించారు. ఐటీ సేవల విభాగం ఆదాయం రూ. 11,264 కోట్ల నుంచి రూ. 13,245 కోట్లకు, బీపీఎస్‌ సెగ్మెంట్‌ ఆదాయం రూ. 2,087 కోట్ల నుంచి రూ. 2,467 కోట్లకు పెరిగాయి. త్రైమాసికం ఆఖరు నాటికి కంపెనీ వద్ద నగదు నిల్వలు సుమారు రూ. 9,695 కోట్లు ఉన్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)