Breaking News

లేఆఫ్స్‌​ వేళ ఉద్యోగుల హక్కులివే!

Published on Tue, 05/05/2026 - 18:43

ప్రస్తుత కాలంలో అగ్రశ్రేణి టెక్ కంపెనీలు చేపడుతున్న సామూహిక తొలగింపులు (లేఆఫ్స్‌) ఉద్యోగ రంగంలో అనిశ్చితిని పెంచుతున్నాయి. అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం ఏ ఉద్యోగికైనా ఒత్తిడితో కూడిన విషయమే. అయితే, తొలగింపునకు గురైనప్పుడు చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు.. తమకు ఎటువంటి సమయం లేదా బేరసారాలు ఆడే అవకాశం లేదని భావించడం. కానీ, చట్టపరమైన నిబంధనలను అర్థం చేసుకుంటే మీకు కొన్ని అవకాశాలున్నాయని ఉపాధి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

40 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక రక్షణ

ముఖ్యంగా 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఉద్యోగులకు ‘ఓల్డ్ వర్కర్స్ బెనిఫిట్ ప్రొటెక్షన్ యాక్ట్ (ఓడబ్ల్యూబీపీఏ)’ కింద ఫెడరల్ చట్టం(యూఎస్‌) ప్రత్యేక రక్షణ కల్పిస్తోంది. ఈ చట్టం ప్రకారం.. సెవెరెన్స్‌ అగ్రిమెంట్‌ పరిశీలించడానికి మీకు కనీసం 21 రోజులు (సామూహిక తొలగింపులైతే 45 రోజులు) గడువు ఇవ్వాలి. ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కూడా మనసు మార్చుకోవడానికి మీకు 7 రోజుల సమయం ఉంటుంది.

కంపెనీలు హడావిడిగా సంతకం చేయమని ఒత్తిడి చేయడం సరికాదు. పైన పేర్కొన్న గడువును ఎవరూ తప్పించలేరు. బలవంతపు సంతకాలు చేయించుకోకూడదు.

ప్యాకేజీని చర్చించడం ఎలా?

చాలామంది ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన మొదటి ఆఫర్‌ను అంగీకరిస్తుంటారు. కానీ, ఆ గణాంకాలు వేరేలా చెబుతున్నాయి. నోలో/మార్టిన్ డేల్-నోలో డేటా ప్రకారం, బేరసారాలు జరిపిన ఉద్యోగులు సగటున 41,500 డాలర్లు వరకు అందుకుంటే, నేరుగా సంతకం చేసిన వారు సగటున 19,200 డాలర్లు పరిహారం మాత్రమే పొందగలిగారు.

చర్చించాల్సిన అంశాలు

  • సాధారణంగా సర్వీసులో ఉన్న సంవత్సరానికి ఒకటి లేదా రెండు వారాల వేతనం ప్రాతిపదికగా ఉంటుంది. దీన్ని పెంచే అవకాశం ఉంటుంది.

  • కోబ్రా వంటి ఆరోగ్య బీమా కవరేజీని కంపెనీయే చెల్లించేలా బేరమాడవచ్చు.

  • స్టాక్ ఆప్షన్లను వేగవంతం చేయమని చర్చించవచ్చు.

  • రెజ్యూమ్ సపోర్ట్, జాబ్ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్, పాజిటివ్ రిఫరెన్స్ లెటర్లు అడగడం మర్చిపోవద్దు.

సంతకానికి ముందు..

చాలా ఒప్పందాల్లో వేధింపులు, వివక్ష లేదా తప్పుడు తొలగింపులకు వ్యతిరేకంగా మీరు పోరాడే హక్కులను వదులుకోవాలంటూ క్లాజ్‌లుంటాయి. ఈ క్లాజులపై అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మీపై అకస్మాత్తుగా ఏదైనా ఒక కారణంచేత తొలగించామని ముద్ర వేస్తే అది మీ కెరీర్‌కు ఆటంకం కావచ్చు. మీ పనితీరు బాగున్నప్పటికీ ఇలా జరిగితే రికార్డులను సవరించమని కోరండి. కంపెనీ సిస్టమ్‌ల నుంచి యాక్సెస్ కోల్పోయేలోపే.. మీ పనితీరు సమీక్షలు, ఈమెయిల్స్, ఒప్పంద పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోండి.

న్యాయ సలహా అవసరమా?

న్యాయవాదిని సంప్రదించడం ఖరీదైన వ్యవహారమని భావించకండి. చాలామంది న్యాయవాదులు నిర్ణీత ఫీజుతో సర్వీసులు అందిస్తారు. మీ కంపెనీతో ఉన్న ఒప్పందంలోని లొసుగులను గుర్తించి చర్చల ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందడంలో వారి సలహా ఎంతో కీలకం. కంపెనీలు పెట్టే గడువుల కంటే మీ హక్కులు గొప్పవి. తొలగింపునకు గురైనప్పుడు ఆందోళన చెందకుండా నిదానంగా వ్యవహరించడం, నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల మీ భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.

ఇదీ చదవండి: ఇండియన్స్‌ నిజంగా గ్రేట్‌!

Videos

ఇళ్లను రద్దు చేస్తాడంటా.. ఎవడబ్బ సొమ్మ ఎవరు రద్దు చేస్తారు..

ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్

దీదీ సంచలన కామెంట్స్.. బీజేపీ 100 సీట్లు చోరీ.!

సింగిల్ గా సింహంలా గర్జించాడు.. విజయ్ గెలుపు పై అంబటి రియాక్షన్

హైదరాబాద్ లో జగన్, విజయ్ ఫొటోతో దుమ్ములిపిన TVK అభిమానులు

TVK Vijay: ఎమ్మెల్యేలతో విజయ్ కీలక సమావేశం

విజయ్ కు తోడుగా త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్ బై ?

ఒకే ఒక్క ఓటు.. DMK మంత్రినే ఓడించిన TVK

విజయ్ కి జై కొట్టిన కాంగ్రెస్..!

ప్రజల తరుపున బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం

Photos

+5

నిర్మాత ఆర్‌బీ చౌదరి నిర్మించిన తెలుగు సినిమాలివే (ఫోటోలు)

+5

గొప్ప మనసు చాటుకున్న విజయ్.. ఆటిజం చిన్నారులతో మీట్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ యాంకర్ అమూల్య నూతన గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఘనంగా దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

మెట్ గాలా-2026 ఈవెంట్‌లో సుధారెడ్డి (ఫొటోలు)

+5

సెల్ఫీ విత్‌ సీఎం విజయ్‌.. సోషల్‌ మీడియా షేక్‌ (ఫొటోలు)

+5

సొట్టబుగ్గల మెగాకోడలు లావణ్య చాన్నాళ్లకు ఇలా (ఫొటోలు)

+5

కోనసీమ జిల్లా : అరటి తోటల మధ్య అందమైన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తమిళులు మెచ్చిన దళపతి.. నేడు ఎమ్మెల్యే విజయ్‌.. రేపు..? (ఫొటోలు)

+5

#MetGala2026 : మెట్ గాలా 2026 ఈవెంట్‌లో ఇషా అంబానీ (ఫోటోలు)