Breaking News

TCS: వాళ్లందరికీ కనీసం ఆర్నెళ్ల జీతం..

Published on Wed, 10/08/2025 - 15:50

దేశీయ ఐటీ సంస్థ టీసీఎస్ (TCS) ఇటీవల భారీ లేఆఫ్‌ ప్రణాళికను (TCS Layoff)ప్రకటించింది. సుమారు 12,000 మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ తొలగింపులతో ‍ప్రభావితమవుతున్న ఉద్యోగులకు వివిధ స్థాయిల  సెవెరెన్స్ ప్యాకేజీని అమలు చేస్తోంది. ఏఐ, డేటా, సైబర్ సెక్యూరిటీలో కంపెనీ పెట్టుబడులను పెంచుతున్న నేపథ్యంలో సిబ్బంది పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో కలకలం రేపింది.

సంస్థలో ఎవరి నైపుణ్యాలైతే పనికిరావో లేదా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం పొందడానికి అవకాశం లేదో అలాంటి వారిని టీసీఎస్‌ తొలగిస్తోంది. వీరందరికీ మూడు నెలల నోటీసు వ్యవధి చెల్లింపుతో పాటు ఆరు నెలల నుండి ఒక సంవత్సరం జీతాన్ని సెవెరెన్స్‌ ప్యాకేజీ కింద అందిస్తోంది. ఇది సంస్థలో వారి సర్వీస్‌ కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే  అందరికీ కనీసం ఆరు నెలల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించారు.

ప్రభావిత ఉద్యోగులు మరో ఉద్యోగం వెతుక్కోవడంలో సహాయపడటానికి, టీసీఎస్ మూడు నెలల వరకు అవుట్ ప్లేస్ మెంట్ ఏజెన్సీ ఫీజులను అందిస్తోంది. అదే జూనియర్ అసోసియేట్లకు అయితే ఇంకొన్ని నెలలు ఈ సహాయాన్ని అందించనుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం పేర్కొంది. ఇక అలాగే ఉద్యోగులకు అందించే మానసిక ఆరోగ్య సాయం టీసీఎస్ కేర్స్‌ను కూడా కొన్నాళ్ల పాటు వారికి కొనసాగించనుంది.

బెంచ్‌లో ఉన్నవారికి మూణ్నెళ్ల జీతమే..
బెంచ్‌లో ఉండి లేదా ఎనిమిది నెలలకు పైగా వర్క్‌ కేటాయించని ఉద్యోగులు తొలగింపునకు గురైతే వారు ప్రామాణిక మూడు నెలల నోటీసు వ్యవధి వేతనాన్ని మాత్రమే పొందుతారు. రిటైర్‌మెంట్‌కు దగ్గరగా ఉన్నవారికి, పదవీ విరమణ ప్రయోజనాలు,  బీమాకు పూర్తి ప్రాప్యతతో ముందస్తు రిటైర్‌మెంట్‌ ఎంపికను టీసీఎస్ అందించింది. అలాంటి వారు మిగిలిఉన్న సర్వీస్‌ కాలాన్ని బట్టి ఆరు నెలల నుండి రెండేళ్ల వరకు జీతాన్ని సెవెరెన్స్‌ ప్యాకేజీగా అందుకుంటారు.

ఇదీ చదవండి: దీపావళి ధమాకా.. ఐఫోన్‌పై రూ.55 వేల డిస్కౌంట్‌!

#

Tags : 1

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)