టీసీఎస్ ఉద్యోగుల డేటా లీక్!

Published on Tue, 08/11/2026 - 14:01

దేశీయ ఐటీ సేవల రంగానికి చెందిన ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) ఉద్యోగుల వ్యక్తిగత వివరాల లీకేజీ వార్తలపై అధికారికంగా స్పందించింది. కొంతమంది ఉద్యోగులకు సంబంధించిన ప్రాథమిక సమాచారం బహిర్గతం అయ్యే అవకాశం ఉందంటూ 'త్రెట్ ఇంటెలిజెన్స్' హెచ్చరికలు జారీ చేసింది. దాంతో సంస్థ స్పందించి సైబర్ భద్రతా తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో తమ కస్టమర్ల డేటా, వ్యాపార వ్యవస్థలు, అంతర్గత నెట్‌వర్క్‌లు అత్యంత సురక్షితంగా ఉన్నాయని, ఎలాంటి డేటా చోరీ జరగలేదని టీసీఎస్ స్పష్టం చేసింది.

నాలుగేళ్ల క్రితం నాటి డేటా?

బహిర్గతం అయినట్లు ప్రచారం జరుగుతున్న ఉద్యోగుల డేటా దాదాపు నాలుగేళ్ల క్రితం నాటిదని, అది కూడా కేవలం ప్రాథమిక వివరాలకు మాత్రమే పరిమితమైందని టీసీఎస్ వెల్లడించింది. హ్యాకర్లు ‘పాస్‌వర్డ్ స్ప్రే’, 'మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫెటీగ్' వంటి సైబర్ దాడి పద్ధతులను ఉపయోగించినట్లు దావా వేసినప్పటికీ తమ రక్షణ వ్యవస్థలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఈ తరహా సైబర్ దాడులను నిరోధించేందుకు అత్యంత బలమైన సెక్యూరిటీ ప్రోటోకాల్స్‌ను అమలు చేస్తున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ దాఖలు చేసిన నివేదికలో పేర్కొంది.

సైబర్ భద్రతపై ముమ్మర నిఘా

క్లయింట్ల నమ్మకాన్ని, డేటా భద్రతను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యతని స్పష్టం చేసిన టీసీఎస్‌ ప్రస్తుతం ఐటీ నెట్‌వర్క్ వాతావరణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. సైబర్ ముప్పులపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ అవసరమైన తక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించింది.

ఇటీవలే టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి సంస్థలు సైబర్ దాడులను ఎదుర్కొన్న నేపథ్యంలో ఐటీ దిగ్గజం టీసీఎస్ సైబర్ భద్రతా విభాగాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. సంస్థల సమాచార భద్రతపై గ్లోబల్ క్లయింట్లలో ఎటువంటి ఆందోళన కలగకుండా ముందస్తుగా ఈ ప్రకటన విడుదల చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..

#

Tags : 1

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)