టీసీఎస్‌.. భేష్‌.. క్యూ4 నికర లాభం రూ. 11,392 కోట్లు

Published on Thu, 04/13/2023 - 03:35

ముంబై: సాఫ్ట్‌వేర్‌ సేవల నంబర్‌వన్‌ దేశీ దిగ్గజం టీసీఎస్‌ గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ4(జనవరి–మార్చి)లో నికర లాభం 15 శాతం ఎగసి రూ. 11,392 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 9,959 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం బలపడి రూ. 59,162 కోట్లకు చేరింది. అంతక్రితం రూ. 50,591 కోట్ల ఆదాయం నమోదైంది. రూ. 41,440 కోట్ల ఫ్రీ క్యాష్‌ఫ్లోను ఆర్జించినట్లు కంపెనీ వెల్లడించింది.  

పూర్తి ఏడాదికి
మార్చితో ముగిసిన గతేడాదికి టీసీఎస్‌ 10 శాతం అధికంగా రూ. 42,147 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 2,25,458 కోట్లను తాకింది. కాగా.. కొత్త సీఈవో, ఎండీగా ఎంపికైన కె.కృతివాసన్‌ ప్రస్తుత సీఈవో రాజేష్‌ గోపీనాథన్‌ నుంచి జూన్‌1న బాధ్యతలు స్వీకరించనున్నట్లు టీసీఎస్‌ పేర్కొంది.  

ఆర్డర్‌ బుక్‌ జోరు
గతేడాది ఆర్డర్‌బుక్‌ 34.1 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు టీసీఎస్‌ వెల్లడించింది. క్యూ4లో 10 బిలియన్‌ డాలర్లు జమైనట్లు తెలియజేసింది. చరిత్రాత్మక స్థాయిలో భారీ డీల్స్‌ సాధించినట్లు పేర్కొంది. 10 కోట్లకుపైగా డాలర్ల క్లయింట్ల సంఖ్య 60కు చేరింది.   బ్యాంకింగ్‌ రంగం సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఉత్తర అమెరికా నుంచి 15 శాతంపైగా వృద్ధి సాధించినట్లు పేర్కొంది.

ఇతర హైలైట్స్‌
► షేరుకి రూ. 24 తుది డివిడెండ్‌ ప్రకటించింది.
► నిర్వహణ లాభ మార్జిన్లు 24.1 శాతం నుంచి 24.5 శాతానికి బలపడ్డాయి.
► నికర మార్జిన్లు సైతం 18.7 శాతం నుంచి 19.3 శాతానికి మెరుగుపడ్డాయి.  
► క్యూ4లో నికరంగా 821మందిని, పూర్తిఏడాదిలో 22,600 మందిని జమ చేసుకుంది.  
► మొత్తం సిబ్బంది సంఖ్య 6,14,795ను తాకింది. దీనిలో మహిళల వాటా 35.7 శాతం.
► ఉద్యోగ వలసల రేటు 20.1%గా నమోదైంది.
► ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 40,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనుంది.


ఫలితాల నేపథ్యంలో టీసీఎస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం బలపడి రూ. 3,246 వద్ద ముగిసింది.

మరోసారి పటిష్ట ఫలితాలు ప్రకటించినందుకు సంతృప్తిగా ఉన్నాం. మా సర్వీసులకున్న డిమాండును ఆర్డర్‌బుక్‌ ప్రతిఫలిస్తోంది. రిటైల్, కన్జూమర్, లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌కేర్‌ విభాగాలు 13–12 శాతం వృద్ధిని సాధించాయి. బీఎఫ్‌ఎస్‌ఐ 9 శాతంపైగా పుంజుకుంది.
– రాజేష్‌ గోపీనాథన్, సీఈవో, టీసీఎస్‌

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)