అంత క్యాష్‌ కనిపించిందా.. కొరడానే!

Published on Mon, 12/08/2025 - 13:40

దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలపై కఠినమైన కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈ మార్పులు వ్యక్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ నిర్వహించే రోజువారీ నగదు ప్రవాహంపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.

కొత్త నిబంధనల ప్రకారం, లెక్కల్లో చూపని నగదుపై జరిమానాలు, సర్‌ఛార్జీలు, సెస్సులు కలిసి మొత్తం 84% వరకు పన్ను భారం పడే అవకాశం ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.

అహుజా పేర్కొన్నట్లుగా, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా స్వాధీనం సందర్భాల్లో వ్యక్తి వద్ద లెక్కలు లేని నగదు పట్టుబడితే ఈ అధిక పన్ను రేటు వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త మార్పుల నేపథ్యంలో ఇటు వ్యక్తులతోపాటు వ్యాపార సంస్థలు నగదు వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

కొత్త నిబంధనలు ఇవే..

  • కొత్త నియమాల ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద మొత్తాల నగదు లావాదేవీలను నిశితంగా పర్యవేక్షించనున్నాయి.

  • ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా నగదు ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి.

  • రూ. 20 లక్షలకు పైగా ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు తక్షణమే టీడీఎస్ (TDS) కట్‌ చేస్తాయి.

  • తరచుగా పెద్ద మొత్తాల నగదు ఉపసంహరణలు జరిగితే, వాటి మూలం అనుమానాస్పదంగా కనిపిస్తే, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా జప్తు చర్యలు కూడా ప్రారంభించవచ్చు.

వీటికి 100% జరిమానా తప్పదు

  • కొన్ని ప్రత్యేక నగదు లావాదేవీలపై ఇకపై  100 శాతం జరిమానా వర్తించనుంది. అటువంటి లావాదేవీలు ఇవే..

  • స్థిరాస్తి విక్రయం సమయంలో రూ. 20,000 కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తే, ఆ మొత్తంపైనే 100% జరిమానా ఉంటుంది.

  • ఒకే రోజులో ఒక కస్టమర్ నుండి రూ. 2 లక్షలకు పైగా నగదు అందుకుంటే ఆ మొత్తంపైనే జరిమానా విధిస్తారు.

  • వ్యక్తులు నగదు రూపంలో రుణాలు పొందడం ఇకపై పూర్తిగా నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే రుణ మొత్తం అంతటిపై 100% జరిమానా పడుతుంది.

ఈ జాగ్రత్తలు అవసరం

  • ప్రభుత్వం కట్టుదిట్టమైన నగదు నియంత్రణ వ్యవస్థను నెలకొల్పుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరం

  • పెద్ద మొత్తాల నగదు లావాదేవీలు తప్పకుండా బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా జరపాలి.

  • నగదు రసీదులు స్పష్టమైన ఆధారాలతో ఉండాలి.

  • అక్రమ, లెక్కల్లో లేని నగదు ఖచ్చితంగా గణనీయమైన పన్ను భారం, జరిమానాలు తెచ్చిపెడుతుంది.
     

Videos

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

ఆమె పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది.. సమంతపై శోభారాజు కామెంట్స్..!

తిరుపతికి కొత్త రైలు..16వేల‌ కోట్లతో ఏపీకి భారీ బడ్జెట్

పని చేయకుండా రీల్స్ చేస్తే ఇలానే ఉంటది చంద్రబాబు, రామ్మోహన్ పై పేర్ని నాని సెటైర్లే సెటైర్లు

టీడీపీకి భారీ షాక్.. YSRCPలో చేరిన 100 కుటుంబాలు

Perni Nani: మరోసారి బాబు అబద్దాలు.. 10 లక్షల కోట్లు అప్పు అంటూ

KA Paul: నన్నే అడ్డుకుంటారా చంద్రబాబుపై KA పాల్ ఫైర్

Puducherry: కరూర్ తొక్కిసలాట తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న విజయ్

Big Shock To Indigo: ఇండిగో సర్వీస్‌పై DGCA కోత

Photos

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)

+5

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీనటుడు విక్రమ్ ప్రభు (ఫోటోలు)

+5

యూత్‌ను గ్లామర్‌తో కొల్లగొట్టిన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

తరుణ్ భాస్కర్,ఈషా రెబ్బ 'ఓం శాంతి శాంతి శాంతి’ టీజర్ రిలీజ్ (ఫొటోలు)