Breaking News

Income Tax: ప్లానింగ్‌ అంటే ఎగవేత కాదు..

Published on Mon, 08/03/2026 - 11:30

ఒకప్పుడు ట్యాక్స్‌ ప్లానింగ్‌ అంటే కేవలం పన్ను ఎగవేత లేదా పన్నుభారం తగ్గించడానికి మార్గాలను ఎంచుకునే ఆలోచనలో ఉండేవారు. కంపెనీలు కానీ, వ్యాపార సంస్థలు కానీ, వ్యక్తులు కానీ పన్ను భారం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటే పూర్తిగా ఎగవేత.. లేదా కుదిరినంతగా ఎగవేత .. ఇలా ఆలోచనలు ఉండేవి.  

ట్యాక్స్‌ ప్లానింగ్‌ అంటే చట్టరీత్యా నేరం కాదు. తప్పు కాదు. నిషిద్ధమైనదీ కాదు. ఇంగ్లిషులో ట్యాక్స్‌ ఎవాయిడెన్స్‌ అంటే ప్లానింగ్‌లో సక్రమమైన మార్గం. అమల్లో ఉన్న ఆప్షన్లలో దేని వల్ల తక్కువ పన్ను భారం ఏర్పడుతుందో, ఆ పద్ధతిని ఎంచుకోవడమే. మీరు మీ ఆదాయ పట్టికను తయారు చేసి, అవసరమైన డిడక్షన్లు ఉంటే పాత పద్ధతిలో, అర్హత లేకపోతే కొత్త పద్ధతిలో లెక్కలు వేసుకోండి. ట్యాక్సబుల్‌ ఇన్‌కం లెక్కించండి. పన్నుభారం లెక్కించి, ఏది తక్కువో నిర్ధారించుకుని, ఆ వైపు మొగ్గు చూపండి. ఇదొక విధానం. తప్పులేదు. పన్ను భారం లేకుండా ఉండటానికి, లేదా తగ్గించుకోవడానికి అడ్డదిడ్డమైన దార్లు తొక్కకండి.

ఇక వ్యాపారంపరంగా ఆలోచిస్తే, ఏ వ్యాపారం పెట్టాలి, ఆ వ్యాపారం నిర్వహించడానికి కంపెనీయా, భాగస్వామ్యమా సొంత వ్యాపారమా.. ఎటువంటి సంస్థని స్థాపించాలి.. ఆయా సంస్థలకు పన్ను విధానం ఎలా ఉంటుంది .. పన్ను రేటెంత? ఇలా మొదలై ఇన్‌కంట్యాక్స్‌పరంగా ఎలా పన్నుభారం తగ్గించుకోవాలి .. ఎలా అడుగు ముందుకేయాలి.. ఇవన్నీ 80వ దశకం.. 90లు, 2000, 2010, 2020 మొదట్లోని ఆలోచనలు.

పెద్ద పెద్ద కంపెనీల్లో ట్యాక్సేషన్‌కి ప్రత్యేకమైన డిపార్టుమెంటు, అందులో ప్రత్యేక వృత్తి నిపుణులు, సమావేశాలు, సమలోచనలు, సమాధానాలు, లెక్కలు, పన్ను రేట్ల విశ్లేషణ, ఫైన్లు, పెనాల్టీలు, లిటిగేషన్, చట్టంలోని పదపదానికి విశ్లేషణ, భాష్యం, అభిప్రాయ సేకరణ, విశ్లేషణ, అన్వయం, అమలు .. తర్వాత అసెస్‌మెంటు పూర్తి ఉత్తర్వులు, విశ్లేషణ, అప్పీళ్లు, గెలవడం, ఓడిపోవడం, ట్రిబ్యునల్‌ ఒక అంకం .. అవసరమైతే హైకోర్టు.. ఇంకా తప్పనిసరి అయితే సుప్రీం కోర్టు వరకు వెళ్లే వ్యవహారం. ఒక అంచనా ప్రకారం సుప్రీం కోర్టులో 6,000 పైచిలుకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యసభలో జవాబు ప్రకారం 41,450 కేసులు వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌. వీటి వల్ల రూ. 4.9 ట్రిలియన్ల రెవెన్యూ భవితవ్యం తేలాలి. ఇక ట్రిబ్యునల్‌ వద్ద 22,230 కేసులు ఉన్నాయి. ఇవి ఎప్పుడు అవుతాయి. అనిశి్చతి..అయోమయ పరిస్థితి. 
త్రిశంకు స్వర్గంలో హడావిడి.

పరిస్థితులు.. దృష్టి మారుతున్నాయి.. 
ఇప్పుడు పరిస్థితి మారింది. జనాల దృష్టి మారింది. లిటిగేషన్‌ని కోరుకోవడం లేదు. బదులుగా ఆ సమయాన్ని, వనరులను ఆస్తుల అభివృద్ధి వైపు మళ్లిస్తున్నారు. వృథా ప్రయాసలతో గెలిచే గెలుపు కన్నా, ఆది నుంచే నిర్దేశించిన పన్ను భారానికి సిద్ధపడి, చెల్లించి ఊపిరి పీల్చుకుంటున్నారు. మెటీరియల్, లేబర్, వడ్డీ, ఖర్చులతో పాటు మరో ఖర్చు ‘ఇన్‌కం ట్యాక్స్‌’ అని భావిస్తున్నారు. లాభం ఎక్కువ సంపాదించి కొంత భాగం పన్నుగా గవర్నమెంటు ఇవ్వడానికి ముందుకు రండి. తన కూతురు పెళ్లికని సిద్ధపడి స్థిరాస్తి విక్రయించగా 
వచి్చన లాభాల మీద పన్ను చెల్లించి, పిల్ల పెళ్లి ఘనంగా చేశాడు సిద్ధరామయ్య. పిల్లాడి చదువు కోసం జాగాలు అమ్మేసి పన్ను చెల్లించి మిగతా మొత్తంతో చదువు చదివించాడు చలపతిరావు అనే ఒక రైతు. కొనడం, అమ్మడం.. లాభం మళ్లీ కొనడం, అమ్మడం పన్నులు సక్రమంగా చెల్లించి పేరు మోసిన బిల్డర్‌ అయ్యారు బాబూరావు. ఆయన దగ్గర బ్లాక్, వైట్‌ ఉండదు. అంతా వైటే.

పన్ను సమస్యే కాదు.. 
నిజమే, మీరు ఎన్నో ఖర్చులు పెడుతున్నారు. విలాసవంతమైన జీవితం సాగిస్తున్నారు. ఎన్నెన్నో దేశాల కన్నా మన దేశంలో ఆదాయపు పన్ను రేట్లు తక్కువనే చెప్పాలి. పన్నుని ఒక ఖర్చుగా భావించుకోండి. పన్ను రేటు ప్రాథమిక సమస్య కాదు. దానితో నిమిత్తం లేకుండా, చెల్లించడం ఒక సంస్కృతి. అలాగే వ్యాపారస్తులు కూడా జీఎస్‌టీ, ఉత్పత్తి వ్యయ నియంత్రణ, ధరల స్థిరీకరణ, చట్టాన్ని గౌరవించడం, చట్టాన్ని తూచా తప్పకుండా ఫాలో కావడం, ముందుచూపుతో, గ్లోబలైజ్డ్‌ పోటీ ప్రపంచంలో నిలవడానికి ‘నాణ్యత’ మొదలైన అంశాలు ప్లాన్‌ చేసుకోవాలి.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)