Breaking News

పన్ను కోతలతో ఆదాయ వృద్ధి కష్టమే

Published on Wed, 11/26/2025 - 08:39

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు తీసుకున్న పన్ను తగ్గింపు నిర్ణయాలు ఆదాయ వృద్ధిని అడ్డుకుంటాయని.. దీంతో ద్రవ్యపరమైన మద్దతుకు పెద్ద అవకాశాల్లేవని మూడిస్‌ రేటింగ్స్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది.

‘‘ఆదాయ వృద్ధిలో బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది. ద్రవ్య స్థిరీకరణ పరంగా అవరోధాలు ఎదుర్కోవచ్చు. కొన్ని పన్ను తగ్గింపులను కూడా చూశాం. ఇది ఆదాయ వృద్ధికి మరింత అడ్డుగా మారొచ్చు. కనుక ద్రవ్యపరమైన మద్దతుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి’’అని మూడిస్‌ రేటింగ్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మార్టిన్‌ పెట్చ్‌ పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ చివరికి నికర పన్ను వసూళ్లు 12.29 లక్షల కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా ఆధారంగా తెలుస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.12.65 లక్షల కోట్ల కంటే స్వల్పంగా తగ్గడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ప్రభుత్వం వేసుకున్న పన్ను వసూళ్ల అంచనాల్లో 43.3 శాతమే సెప్టెంబర్‌ చివరికి (ఆరు నెలల్లో) సమకూరింది.

క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం అంచనాల్లో 49 శాతం మేర తొలి ఆరు నెలల్లో రావడం ఉంది. ఆదాయపన్ను మినహాయింపును కొత్త విధానంలో రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ఇక సెప్టెంబర్‌ 22 నుంచి జీఎస్‌టీ శ్లాబుల్లో తీసుకొచి్చన మార్పులతో 375 ఉత్పత్తులపై పన్ను తగ్గింది. వాస్తవానికి ఈ రేటు తగ్గింపుతో వినియోగం పెరుగుతుందన్నది కేంద్రం అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతానికి పరిమితం చేయాలన్నది కేంద్రం లక్ష్యం.

వినియోగం, వ్యయాలే అండ..

ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగిరావడం, వడ్డీ రేట్ల తగ్గింపుతో గృహాల కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఇది వినియోగానికి మద్దతునిస్తుందని మార్టిన్‌ పెట్చ్‌ అన్నారు. దేశీ వినియోగానికి తోడు మౌలిక వసతుల అభివృద్ధికి చేసే వ్యయాలు భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని.. అమెరికా టారిఫ్‌ల ప్రభావాన్ని సర్దుబాటు చేస్తాయని పేర్కొన్నారు. ఒకవేళ టారిఫ్‌లు ఇక ముందూ గరిష్ట స్థాయిలోనే కొనసాగితే, అది ఇకపై పెట్టుబడులను ప్రతికూలంగా మారొచ్చన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 7 శాతం, 2026లో 6.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని గత వారం మూడిస్‌ అంచనాలు వ్యక్తం చేయడం తెలిసిందే.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)