Breaking News

పెగాట్రాన్‌లో వాటాలపై టాటా కన్ను

Published on Fri, 11/29/2024 - 04:23

న్యూఢిల్లీ: యాపిల్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ పెగాట్రాన్‌ భారత వ్యాపారంలో వాటాలు కొనుగోలు చేయడంపై టాటా గ్రూప్‌ దృష్టి సారించింది. పెగాట్రాన్‌ కార్యకలాపాల్లో సుమారు 60 శాతం వాటాను దక్కించుకోవడంపై టాటా ఎల్రక్టానిక్స్‌ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై గత ఏడాది కాలంగా ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

యాపిల్‌ ఉత్పత్తుల తయారీలో మార్జిన్లు చాలా తక్కువగా ఉండటం, ప్లాంట్లలో కారి్మకుల డిమాండ్లతో సమస్యలు వస్తున్నా, అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ, సకాలంలో ఉత్పత్తులను సరఫరా చేయాల్సి రావడం కంపెనీకి సవాలుగా ఉంటోందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కార్యకలాపాలకు సంబంధించి స్థానిక కంపెనీని భాగస్వామిగా చేసుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు వివరించాయి. 

తమిళనాడులో ఉన్న పెగాట్రాన్‌ ఫ్యాక్టరీలో 10,000 మంది వర్కర్లు ఉండగా, ఏటా యాభై లక్షల ఐఫోన్ల తయారీ సామర్థ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది భారత్‌లో తయారైన మొత్తం ఐఫోన్లలో 10% ఫోన్లను పెగాట్రాన్‌ ఉత్పత్తి చేసినట్లు అంచనా. తమిళనాడులోని హోసూర్‌లో ఏర్పాటు చేసే ప్లాంటు కోసం టాటా, పెగాట్రాన్‌ జట్టు కట్టనున్నట్లు సమాచారం. టాటా గ్రూప్‌ ఇప్పటికే మరో ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్‌ భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)