Breaking News

గాల్లో ఎగిరిన ‘టాటా సుమో’.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..

Published on Sat, 10/12/2024 - 11:39

తెలుగు ఫ్యాక్షన్‌ సినిమాలో కార్లు గాల్లో ఎగరడం చూసుంటాం కదా. హీరో ఒక విజిల్‌ వేసినా లేదా తొడ కొట్టినా అప్పటి సినిమాల్లో ‘టాటా సుమో’లు గాల్లో ఎగిరిన సన్నివేశాలు కోకొల్లలు. ఆ సీన్లతో మాస్‌ ప్రేక్షకులను ఆకర్షించిన దర్శకులు ఎందరో ఉన్నారు. అయితే అప్పట్లో టాటా అంటే వెంటనే గుర్తొచ్చేది టాటా సుమో.. అంతలా ప్రజాదరణ పొందిందీ కారు. అప్పట్లో కారంటే విలాసం. ఇప్పుడు అవసరం. అనతికాలంలోనే మూడేళ్లలో లక్షకుపైగా ఈ కార్లు అమ్ముడయ్యాయి. అసలు ఆ కారుకు సుమో అని ఎందుకు పేరు పెట్టారో తెలుసుకుందాం.

‘సుమో’ అంటే ఇదేదో జపనీస్‌ రెజ్లర్ల పేరులా ఉందని చాలామంది భావిస్తారు. కానీ దీని పేరు వెనక పెద్ద కథే ఉంది. టాటా సుమో తయారీ యూనిట్‌ టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు సాధారణంగా ప్రతి రోజు అందరూ కలిసి భోజనం  చేసే వారు. కానీ ఆ సంస్థ ఎండీ మోల్‌గావ్‌కర్‌ మాత్రం రోజూ ఏదో ఒక సాకు చెప్పి బయటకు వెళ్లేవారు. కొన్ని గంటల తర్వాత తిరిగి ఆఫీస్‌కు వచ్చేవారు. ఆ తర్వాత రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ టీమ్‌తో సమావేశమయ్యేవారు.

నిత్యం అలా ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్తున్న మోల్‌గావ్‌కర్‌ను ఒకరోజు టీమ్‌లోని ఎగ్జిక్యూటివ్‌ సిబ్బంది ఫాలో అయ్యారు. మోల్‌గావ్‌కర్‌ తమ ఆఫీస్‌ సమీపంలోని ట్రక్కు డ్రైవర్ల వద్దకు వెళ్లడం గమనించారు. వారితో కలిసి ఆయన భోజనం చేయడం చూశారు. టాటా వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకునేవారు. తిరిగి ఆఫీస్‌కు వచ్చాక ఈ సమస్యలను ఆర్‌ అండ్‌ డీ టీమ్‌తో కలిసి చర్చించి అందుకు పరిష్కారాన్ని కనిపెట్టేవారు. ఆ సమస్యలు టాటా సుమో తయారీలో పునరావృతం కాకుండా జాగ్రత్తపడేవారు.

ఇదీ చదవండి: టోల్‌ఛార్జీ లేకుండా ఫ్రీగా వెళ్లొచ్చు!

మోల్‌గావ్‌కర్‌ నిత్యం రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బృందానికి అవసరమైన ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా టాటా మోటార్స్‌ అభివృద్దికి ఆయన ఎంతో కృషి చేశారు. దాంతో టాటా యాజమాన్యం ఆయన పేరు మీద ఐకానిక్‌ కారును లాంచ్‌ చేయాలని నిర్ణయించింది. మోల్‌గావ్‌వర్‌ అసలు పేరు..సు-మంత్ మో-ల్‌గావ్‌కర్‌. తన పేరు మొదటి అక్షరాలతో ‘టాటా సుమో’ను లాంచ్‌ చేశారు. టాటా సంస్థలో కష్టపడిన వారికి ఎలాంటి స్థానం కల్పించారో ఈ సంఘటనతో అర్థం చేసుకోవచ్చు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)