Breaking News

టాటా సన్స్‌ ఐపీవో గడువు మిస్‌..

Published on Thu, 10/02/2025 - 15:51

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం టాటా సన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టవలసిన గడువు ముగియడంతో తాజాగా ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా ఈ అంశంపై స్పందించారు. రిజిస్ట్రేషన్‌ రద్దయ్యేవరకూ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకునే వీలున్నట్లు తెలియజేశారు.

టాటా సన్స్‌సహా.. కొన్ని సంస్థలను ఆర్‌బీఐ ఈ ఏడాది సెప్టెంబర్‌ 30లోగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌కు ఆదేశించింది. అయితే డైవర్సిఫైడ్‌ దిగ్గజం టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ కీలక ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ(సీఐసీ) రిజిస్ట్రేషన్‌ను అప్పగించేందుకు గతేడాది ఆర్‌బీఐకు దరఖాస్తు చేసింది.

తద్వారా తప్పనిసరి లిస్టింగ్‌ను తప్పించుకుకోనుంది. కాగా.. ఆర్‌బీఐ ఈ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇప్పటికే అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీలుగా గుర్తింపు పొందిన 15 సంస్థలను సెపె్టంబర్‌ 30లోగా ఐపీవో చేపట్టమంటూ ఆదేశించింది.

టాటా సన్స్‌మినహా మిగిలిన కంపెనీలు నిబంధనలను పాటించాయి. కంపెనీ లిస్టయితే 18 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్న షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ లబ్ది పొందనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)