Breaking News

క్రాష్ టెస్ట్‌లో తడాఖా.. ప్రముఖ ఈవీలకు 5 స్టార్ రేటింగ్

Published on Sat, 06/15/2024 - 20:18

క్రాష్ టెస్ట్‌లో దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు తడాఖా చూపించాయి. టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ 5 స్టార్ భారత్-ఎన్‌సీఏపీ సేఫ్టీ రేటింగ్ సాధించాయని టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం) ప్రకటించింది.

అడల్ట్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 31.46/32 పాయింట్లు, చైల్డ్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో 45/49 పాయింట్లు సాధించడం ద్వారా పంచ్ ఈవీ ఇప్పటివరకు ఏ వాహనం సాధించని అత్యధిక స్కోర్లను అందుకోవడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని నిర్దేశించింది. ఇక నెక్సాన్ ఈవీ కేఓపీలో 29.86/32 పాయింట్లు, సీఓపీలో 44.95/49 పాయింట్లను సాధించింది. దీంతో టాటా మోటార్స్ ఇప్పుడు భారత్-ఎన్‌సీఏపీ, గ్లోబల్-ఎన్‌సీఏపీ పరీక్షలలో 5-స్టార్ స్కోర్ చేసిన సురక్షితమైన శ్రేణి ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియో కలిగిన ఏకైక ఓఈఎంగా నిలిచింది.

'భారత్-ఎన్‌సీఏపీ కింద నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలకు 5 స్టార్ రేటింగ్ లభించడంపై టాటా మోటార్స్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఈ సర్టిఫికేషన్ దేశంలో సురక్షితమైన వాహనాల పట్ల భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను 'ఆత్మనిర్భర్'గా మార్చడంలో భారత్-ఎన్‌సీఏపీ పాత్రను నొక్కి చెబుతుంది" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

పంచ్ ఈవీ లాంచ్ అయినప్పటి నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంది.  గ్రామీణ మార్కెట్ల నుంచి 35 శాతానికి పైగా కస్టమర్లు ఉన్నారు. పంచ్ ఈవీని 10,000 మందికి పైగా కొనుగోలు చేశారు. భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి నాంది పలికిన నెక్సాన్ ఈవీ 2020 లో లాంచ్ అయినప్పటి నుంచి 68,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ ఎస్‌యూవీని అప్‌డేటెడ్‌ వర్షన్‌ను 2023లో ఆవిష్కరించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)