Breaking News

2030 నాటికి రూ. 1.46 లక్షల కోట్ల పెట్టుబడులు

Published on Sun, 12/08/2024 - 04:27

న్యూఢిల్లీ: 2030 నాటికి నిర్వహణ సామర్థ్యాలను రెట్టింపు స్థాయికి పెంచుకోవడంపై టాటా పవర్‌ దృష్టి పెట్టింది. 31.9 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామరర్థ్యాన్ని సాధించే దిశగా రూ. 1.46 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. కంపెనీ సీఈవో, ఎండీ ప్రవీర్‌ సిన్హా ఈ విషయాలు వెల్లడించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో టాటా పవర్‌ స్థాపిత సామర్ధ్యం 15.6 గిగావాట్లుగా ఉంది. 

ఇందులో పునరుత్పాదక విద్యుత్‌ విభాగం వాటా 6.7 గిగావాట్లుగా ఉండగా.. ఇది 2030 నాటికి నిర్దేశించుకున్న విద్యుదుత్పత్తి సామర్ధ్యంలో 23 గిగావాట్లకు పెరగనుంది. మరోవైపు, ట్రాన్స్‌మిషన్‌ విభాగాన్ని కూడా పటిష్టం చేసుకుంటున్నట్లు సిన్హా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం 4,633 సీకేఎంగా (సర్క్యూట్‌ కిలోమీటర్స్‌) ఉన్న ట్రాన్స్‌మిషన్‌ లైన్ల సామర్థ్యాన్ని 10,500 సీకేఎంకి పెంచుకోనున్నట్లు వివరించారు. 

అలాగే కస్టమర్ల సంఖ్యను 1.25 కోట్ల నుంచి 4 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిన్హా చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ. 21,000 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 26,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రూ. 61,542 కోట్లుగా ఉన్న ఆదాయాన్ని 2030 నాటికి రూ. 1 లక్ష కోట్లకు, నికర లాభాన్ని రూ. 4,100 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సిన్హా చెప్పారు.

#

Tags : 1

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి