Breaking News

ఇది టాటా పవర్‌.. అది రిలయన్స్‌ పవర్‌..

Published on Wed, 11/12/2025 - 18:08

విద్యుత్‌ రంగ దిగ్గజం టాటా పవర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌ (క్యూ2)లో నికర లాభం 14 శాతం ఎగసి రూ. 1,245 కోట్లను తాకింది. అమ్మకాలు పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 1,093 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం స్వల్ప(3 శాతం) వృద్ధితో రూ. 15,769 కోట్లను తాకింది. గత క్యూలో రూ. 15,247 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. నిర్వహణ లాభం(ఇబిటా) 6 శాతం మెరుగుపడి రూ. 4,032 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 3,808 కోట్ల ఇబిటా సాధించింది. సొంత అవసరాల కోసం 10 గిగావాట్ల వేఫర్‌ ఇన్‌గాట్‌ ప్రాజెక్టు ఏర్పాటు ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

రిలయన్స్‌ పవర్‌కు లాభాలు
ప్రయివేట్‌ రంగ విద్యుత్‌ కంపెనీ రిలయన్స్‌ పవర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జూలై–సెప్టెంబర్‌(క్యూ2)లో రూ. 87 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 352 కోట్ల నికర నష్టం నమోదైంది.

మొత్తం ఆదాయం సైతం రూ. 1,963 కోట్ల నుంచి రూ. 2,067 కోట్లకు బలపడింది. వృద్ధికి అవసరమైన నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ పేర్కొంది. మార్పిడికి వీలయ్యే విదేశీ మారక బాండ్ల(ఎఫ్‌సీసీబీలు) జారీ ద్వారా 60 కోట్ల డాలర్లవరకూ సమకూర్చుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు వెల్లడించింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)