Breaking News

బంపర్‌ డిస్కౌంట్‌.. ఈ ఎలక్ట్రిక్‌ కారుపై రూ.2 లక్షల తగ్గింపు!

Published on Thu, 09/05/2024 - 19:58

ఎలక్ట్రిక్‌ కార్ కొనాలనుకుంటున్నవారికి ఇది నిజంగా భారీ శుభవార్త. ప్రముఖ దేశీయ కార్‌ మేకర్‌ టాటా మోటర్స్‌ '2 మిలియన్ ఎస్‌యూవీ వేడుక'లో భాగంగా తమ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని పలు వాహనాలపై బంపర్‌ డిస్కౌంట్లు ప్రకటించింది. పాపులర్‌ టాటా నెక్సాన్‌ ఈవీపై గరిష్టంగా రూ. 2.05 లక్షల వరకూ తగ్గింపు అందిస్తోంది.

ఈ సెప్టెంబర్‌ నెలలో టాటా ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనేవారికి భారీగా డబ్బు ఆదా కానుంది. టాటా మోటర్స్‌ ఈవీ పోర్ట్‌ఫోలియోలోని టాటా నెక్సాన్‌ ఈవీ (Tata Nexon EV), పంచ్ ఈవీ (Punch EV), టియాగో ఈవీ (Tiago EV)లపై గ్రీన్‌ బోనస్‌లో భాగంగా క్యాష్‌ డిస్కౌంట్లు అందిస్తోంది. 2023 మోడల్‌లను ఎంచుకునే వారికి అదనపు తగ్గింపు లభిస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీపై భారీ డిస్కౌంట్‌
టాప్ స్పెక్స్‌ ఉండే టాటా నెక్సాన్ ఈవీ ఎంపవర్డ్+ లాంగ్‌ రేంజ్‌ వేరియంట్‌లపై ఈ నెలలో రూ. 1.80 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది టాటా మోటర్స్‌. రూ. 20,000 తగ్గింపుతో లభించే ఎంట్రీ-లెవల్ క్రియేటివ్ + ఎంఆర్‌ వేరియంట్ తప్ప మిగిలిన అన్ని వేరియంట్‌లు రూ. 1 లక్ష నుండి రూ. 1.2 లక్షల వరకూ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.

2023లో తయారైన అన్ని మోడల్‌లపై అయితే రూ. 25,000 అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది. టాటా నెక్సాన్‌ ఈవీ ధర రూ. 14.49 లక్షల నుండి రూ. 19.49 లక్షల మధ్య ఉంటుంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. కంపెనీ పేర్కొన్నదాని ప్రకారం.. 30kWh వేరియంట్‌ 275 కి.మీ, 40.5kWh యూనిట్ 390 కి.మీ. రేంజ్‌ ఇస్తాయి.

ఇతర ఈవీలపైనా..
ఇక టాటా మోటర్స్‌ డిస్కౌంట్‌ అందిస్తున్న ఇతర ఈవీలలో టాటా టియాగో ఈవీ, టాటా పంచ్‌ ఈవీ ఉన్నాయి. వీటిలో టాటా టియాగో ఈవీలపై గరిష్టంగా రూ.65,000, అలాగే టాటా పంచ్‌ ఈవీలపై రూ.30,000 వరకూ డిస్కౌంట్‌ లభిస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)