Breaking News

ఫుడ్‌ డెలివరీలోకి టాటా న్యూ

Published on Tue, 03/26/2024 - 00:38

ముంబై: టాటా గ్రూప్‌ రూపొందించిన మలీ్టపర్పస్‌ సూపర్‌ యాప్‌ టాటా న్యూ వచ్చే ఏడాది రెండో వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో డిజైన్‌ను సరికొత్తగా మార్చే యోచనలో ఉంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీలోకి ప్రవేశించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ఓపెన్‌ నెట్‌వర్క్‌ డిజిటల్‌ కామర్స్‌(ఓఎన్‌డీసీ)ను వినియోగించుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ వివరాల ప్రకారం సాంకేతిక అంశాల కారణంగా యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)ను బ్లాక్‌ నుంచి వైట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లోకి మార్చనుంది. 2022 ఏప్రిల్‌ 7న టాటా గ్రూప్‌ సూపర్‌ యాప్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత క్లోజ్‌డ్‌ యూజర్‌ గ్రూప్‌తో టాటా న్యూ యాప్‌ ప్రారంభంకాగా.. రెండు నగరాల(బెంగళూరు, ఢిల్లీ)కే పరిమితమైంది.

ప్రస్తుతం ఓఎన్‌డీసీతోపాటు మ్యాజిక్‌పిన్‌ సహకారం ద్వారా ఫుడ్‌ డెలివరీ సరీ్వసులను ప్రవేశపెట్టనుంది. గతేడాది ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ కారణంగా మ్యాజిక్‌పిన్‌ ఫుడ్‌ ఆర్డర్లు రెట్టింపయ్యాయి. కాగా.. గత నెలలో కొత్త సీఈవోగా సీఈవో నవీన్‌ తహిల్యానికి బాధ్యతలు అప్పగించడంతోపాటు పలు మార్పులకు టాటా న్యూ తెరతీసింది. వివిధ బిజినెస్‌ చీఫ్‌లతో నవీన్‌ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పరిస్థితులపై ఉద్యోగులతో సర్వే చేపట్టారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)