Breaking News

ఏటా పెట్టుబడి.. 2,000 కోట్లు

Published on Tue, 01/21/2025 - 04:32

న్యూఢిల్లీ: కొత్త వాణిజ్య వాహనాలు, యంత్ర పరికరాల అభివృద్ధిపై ఏటా దాదాపు రూ.2,000 కోట్ల పెట్టుబడిని కొనసాగిస్తామని టాటా మోటార్స్‌  ఈడీ గిరీశ్‌ వాఘ్‌ వెల్లడించారు. ఇందులో ఎలక్ట్రిఫికేషన్, అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్, కనెక్టెడ్‌ వెహికిల్‌ ప్లాట్‌ఫామ్‌ వంటి నూతన సాంకేతికతలపై 40 శాతంపైగా వెచి్చస్తామన్నారు. 

సంస్థకు చెందిన వాణిజ్య వాహన విభాగం ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఉద్గారాలను వెదజల్లని బ్యాటరీ ఎలక్ట్రిక్, ఫ్యూయల్‌ సెల్‌ ఎలక్ట్రిక్, హైడ్రోజన్‌ ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ వంటి వివిధ సాంకేతికతలపై పని చేస్తోందని చెప్పారు. సున్నా ఉద్గారాల దిశగా పరివర్తన  వెంటనే జరగదు కాబట్టి అన్ని ప్రత్యామ్నాయ ఇంధనాలపై పని చేస్తున్నామని అన్నారు. ‘నగరాలు, సమీప దూరాలకు బ్యాటరీ వాహనాలు పనిచేస్తాయి. సుదూర ప్రాంతాలకు, అధిక సామర్థ్యానికి హైడ్రోజన్‌ వంటి సాంకేతికత అవసరం. ఇటువంటి అవసరాలన్నింటినీ పరిష్కరించే సాంకేతికతలలో పెట్టుబడి పెట్టాం’ అని వివరించారు. 

హైడ్రోజన్‌ ట్రక్స్‌.. 
హైడ్రోజన్‌ ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్‌ కలిగిన ట్రక్స్‌ను మార్చిలోగా పైలట్‌ ప్రాతిపదికన వినియోగిస్తామని గిరీశ్‌ వాఘ్‌ వెల్లడించారు. నేషనల్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌ మిషన్‌లో భాగంగా ఐవోసీఎల్‌తో కలిసి కంపెనీ 18 నెలల పాటు మూడు రూట్లలో ఈ ట్రక్కులను నడుపనుంది. ఫలితాలను బట్టి వాహనాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని 
చెప్పారు. ఫ్యూయల్‌ సెల్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నట్టు వాఘ్‌ పేర్కొన్నారు. కంపెనీ తయారు చేసిన 15 ఫ్యూయల్‌ సెల్‌ ఎలక్ట్రిక్‌ బస్‌లు ఐవోసీఎల్‌ 10 నెలలుగా వినియోగిస్తోందని వివరించారు. ఒకట్రెండేళ్లలో హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ వాహనాలను వాణిజ్యపరంగా ప్రవేశపెడతామని చెప్పారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)