Breaking News

అమ్మకాల్లో దుమ్మురేపిన టాటా మోటార్స్: ఆ నాలుగు కార్లకు భలే డిమాండ్..

Published on Sun, 04/02/2023 - 20:30

దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) 2023 మార్చి నెల అమ్మకాల గణాంకాల నివేదికలను విడుదల చేసింది. ఈ నివేదికల ప్రకారం కంపెనీ గత నెలలో ఏకంగా 44,044 యూనిట్ల కార్లను విక్రయించినట్లు తెలిసింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాల్లో టాటా మోటార్స్ గొప్ప రికార్డ్ సృష్టించింది. 2022 ఏప్రిల్ నుంచి 2023 మార్చి నాటికి కంపెనీ 5,38,640 యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ అమ్మకాలు 45.43 శాతం పెరిగాయి.

2022 ఆర్థిక సంవత్సరంలో కరోనా మహమ్మారి కారణంగా టాటా మోటార్స్ 3,70,372 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో మారుతి సుజుకీ, హ్యుందాయ్ తరువాత టాటా మోటార్స్ అతి పెద్ద సంస్థ. గత నెలలో కంపెనీ ఎక్కువగా నెక్సాన్, పంచ్, హారియార్, సఫారీ వంటి కార్లను విక్రయించింది. మొత్తం అమ్మకాల్లో ఈ ఎస్‍యూవీల వాటా 66శాతం.

మొత్తం అమ్మకాల్లో (44,044 యూనిట్లు) ఎలక్ట్రిక్ వెహికల్స్ (6,509 యూనిట్లు) కూడా ఉన్నాయి. 2022 మార్చితో పోలిస్తే ఈ అమ్మకాలు నాలుగు శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలుస్తోంది. అంటే 2022 మార్చిలో కంపెనీ అమ్మకాలు 42,293 యూనిట్లు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో కంపెనీ వృద్ధి 89 శాతం ఉండటం గమనార్హం. 2022లో ఈవీల అమ్మకాలు 19,668 యూనిట్లు.

(ఇదీ చదవండి: మార్కెట్లో కొత్త నాయిస్ స్మార్ట్‌వాచ్ లాంచ్: ధర తక్కువ & బోలెడన్ని ఫీచర్స్..)

ఇక కమర్షియల్ వెహికల్స్ సేల్స్ విషయానికి వస్తే, 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 3,93,317 యూనిట్లను విక్రయించింది. అదే సమయంలో 2022లో ఈ అమ్మకాలు 3,22,182 యూనిట్లు. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాల్లో కూడా 22 శాతం పెరుగుదల ఉంది. ఎగుమతుల విషయంలో కంపెనీ భారీ తగ్గుదలను నమోదు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)