Breaking News

మళ్లీ పెరగనున్న టాటా కార్ల ధరలు..

Published on Fri, 04/14/2023 - 15:32

టాటా కార్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. పెరుగుతున్న తయారీ ఖర్చులు, బీఎస్‌ నిబంధనల మార్పు కారణంగా పెరిగిన ఆర్థిక భారంతో టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. 2023లో కార్ల ధరలను పెంచడం ఇది రెండోసారి.

(Akshay Tritiya 2023: అక్షయ తృతీయ నాడు బంగారం కొంటున్నారా? ఈ విషయాలు గుర్తుంచుకోండి...)

తమ ప్యాసింజర్ వాహనాల ధరల సగటు పెరుగుదల 0.6 శాతం ఉంటుందని టాటా మోటర్స్‌ పేర్కొంది. పెరిగే ధర కార్‌ మోడల్, వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. ధరల పెంపు మే 1 నుంచి అమలులోకి వస్తుంది. 2023 సంవత్సరంలో టాటా మోటార్స్ ధరలను పెంచడం ఇది రెండవ సారి. అంతకుముందు జనవరిలో ధరలను 1.2 శాతం పెంచింది.

బీఎస్‌ 6 నిబంధనలను అమలు చేయడం వల్ల ఈ నెల ప్రారంభంలో  దేశంలోని అన్ని కంపెనీల్లో అన్ని విభాగాలలో వాహనాల ధరలు పెరిగాయి. ఉద్గారాలను పర్యవేక్షించడానికి వాహన తయారీదారులు వాహనాలకు ప్రత్యేక పరికరాన్ని తప్పనిసరిగా అమర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫలితంగా తయారీ ఖర్చు పెరిగింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో పలుమార్లు ధరలు పెరిగినప్పటికీ భారతదేశంలో అత్యధిక ప్యాసింజర్ కార్ల అమ్మకాలు నమోదయ్యాయి. పెద్ద కార్లు, ఖరీదైన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ)కు అధిక డిమాండ్ కారణంగా అమ్మకాలు పెరిగాయి. టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్, పంచ్ ఎస్‌యూవీలు 2022లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచాయి.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)