Breaking News

టాటా మోటార్స్‌ లాభం డౌన్‌

Published on Sat, 11/09/2024 - 06:00

న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జులై–సెపె్టంబర్‌(క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 10 శాతం క్షీణించి రూ. 3,450 కోట్లకు పరిమితమైంది. అమ్మకాలు తగ్గడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 3,832 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 1,04,444 కోట్ల నుంచి రూ. 1,00,534 కోట్లకు వెనకడుగు వేసింది. 

మొత్తం వ్యయాలు సైతం రూ. 1,00,649 కోట్ల నుంచి రూ. 97,330 కోట్లకు తగ్గాయి. ప్యాసింజర్‌ వాహన విభాగం నుంచి 4 శాతం తక్కువగా రూ. 11,700 కోట్ల ఆదాయం లభించగా.. అమ్మకాలు 6% నీరసించి 1,30,500 యూనిట్లకు పరిమితమైనట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. వాణిజ్య వాహన(సీవీ) అమ్మకాలు 20 శాతం క్షీణించి 79,800 యూనిట్లను తాకాయి. ఎగుమతులు 11% తగ్గి 4,400 యూనిట్లకు చేరాయి. సీవీ బిజినెస్‌ ఆదాయం 14% తక్కువగా రూ. 17,300 కోట్లకు పరిమితమైంది.   

జేఎల్‌ఆర్‌ డీలా 
లగ్జరీ కార్ల బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ ఆదాయం 6 శాతం నీరసించి 6.5 బిలియన్‌ పౌండ్లకు పరిమితమైనట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది. అల్యూమినియం సరఫరాల తాత్కాలిక సమస్యలతో లాభాలు ప్రభావితమైనట్లు తెలియజేసింది. వీటికితోడు 6,029 వాహనాలను అదనపు నాణ్యతా సంబంధ పరిశీలనలకోసం నిలిపిఉంచినట్లు వెల్లడించింది. దీంతో డిమాండుకు అనుగుణంగా వాహన డెలివరీలను చేపట్టలేకపోయినట్లు తెలియజేసింది. ఎలక్ట్రిక్‌ వాహన ఉత్పత్తి కోసం యూకే హేల్‌ఉడ్‌ ప్లాంట్‌పై 25 కోట్ల పౌండ్లను ఇన్వెస్ట్‌ చేసినట్లు జేఎల్‌ఆర్‌ సీఈవో అడ్రియన్‌ మార్డెల్‌ పేర్కొన్నారు.
 

ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్‌ షేరు బీఎస్‌ఈలో 1.7 శాతం నష్టంతో రూ. 806 వద్ద ముగిసింది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)